క్రీడాభూమి

ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్లను తీర్చిదిద్దనున్న ఇలియట్, హారిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 28: ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే బాధ్యతను మాజీ టెస్టు స్టార్లు మాథ్యూ ఇలియట్, ర్యాన్ హారిస్‌జకు అప్పగించారు. స్వదేశంలో శ్రీలంకతో ఏప్రిల్‌లో జరుగనున్న అండర్-19 సిరీస్‌తో వీరు ఈ పని ప్రారంభించనున్నారు. ఆస్ట్రేలియాలో భవిష్యత్తు తరం క్రికెటర్లను తీర్చిదిద్దే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న నేషనల్ క్రికెట్ సెంటర్‌లో హై పెర్ఫార్మెన్స్ కోచ్, డిప్యుటీ కోచ్‌లుగా చేరేందుకు మొత్తం 38 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ రేసులో చివరికి మాజీ బ్యాట్స్‌మన్ ఇలియట్, మాజీ ఫాస్ట్ బౌలర్ హారిస్ నెగ్గి వరుసగా ఆ పదవులను దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో వర్థమాన క్రికెటర్ల శిక్షణ కోసం విస్తృతమైన కసరత్తు నిర్వహించి ఇలియట్, హ్యారిస్‌లను ఎంపిక చేశామని, వీరు ఆ బాధ్యతలను ఎప్పుడు చేపడతారా? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ ప్యాట్ హోవర్డ్ తెలిపాడు. దేశంలోని వర్థమాన క్రికెటర్ల ప్రతిభకు మెరుగులు దిద్ది వారిని ఫస్ట్‌క్లాస్, అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేయడంలో ఎదురయ్యే సవాళ్లేమిటన్న దానిపై ఇలియట్, హారిస్‌లకు చక్కటి అవగాహన ఉందని, అందుకే వీరికి ఈ బాధ్యతలు అప్పగించామని హోవర్డ్ చెప్పాడు. నేషనల్ క్రికెట్ సెంటర్‌లో హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా సేవలు అందించిన గ్రేమ్ హిక్‌ను ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమించడం, అలాగే డిప్యుటీ హై పెర్ఫార్మెన్స్ కోచ్ పదవిని కొత్తగా సృష్టించడంతో ఈ పదవులకు ఇలియట్, హారిస్‌లను ఎంపిక చేశామని హోవర్డ్ వివరించాడు.

చిత్రం... హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఎంపికైన మాథ్యూ ఇలియట్