క్రీడాభూమి

జీతూ రాయ్‌కి కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో వర్థమాన షూటర్ జీతూ రాయ్ మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్తోలు ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు నాలుగో పతకం లభించినట్టయింది. ఎనిమిది మంది పాల్గొన్న ఈ ఈవెంట్ ఫైనల్‌లో జీతూ రాయ్ మొత్తం 216.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాలను కైవసం చేసుకున్న జీతూ రాయ్ ఫైనల్‌లో మొదటి సిరీస్ ముగిసే సమయానికి ఏడో స్థానంలో నిలిచి చాలా వెనుకబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని రెండో సిరీస్ ముగిసే సమయానికి 98.7 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఎలిమినేషన్ దశకు చేరిన తర్వాత కూడా అతను అదే జోరును కొనసాగించాడు. ఈ దశలో రెండుసార్లు 10 చొప్పున, మరో రెండుసార్లు 10.6 చొప్పున సాధించిన జీతూ రాయ్ ఆ తర్వాత 9.9 పాయింట్లు రాబట్టుకున్నాడు. తద్వారా అతను చైనా షూటర్ జన్యీ జు (197.9 పాయింట్లు)ని వెనక్కి నెట్టి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అప్పటికి వియత్నాం షూటర్ జువాంగ్ విన్ హొవాంగ్ కంటే 0.1 పాయింట్ స్వల్ప ఆధిక్యతతో జీతూ రాయ్ రజత పతకం కోసం పోటీపడినప్పటికీ చివర్లో 8.6 పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు. దీంతో అతను కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఈవెంట్‌లో జపాన్‌కు చెందిన తొమొయుకీ మత్సుడా 240.1 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించగా, వియత్నాంకు చెందిన జువాన్ విన్ హొవాంగ్ 236.6 పాయింట్లతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.