క్రీడాభూమి

వెస్టిండీస్ పర్యటనలో హాలెస్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 28: గాయం కారణంగా ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు దూరమైన ఒపెనర్ అలెక్స్ హాలెస్‌కు నెల రోజుల తర్వాత మళ్లీ ఆ జట్టులో చోటు లభించింది. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్ పర్యటన ప్రారంభించనున్న ఇంగ్లాండ్ జట్టు నుంచి అతనికి పిలుపు వచ్చింది. కెరీర్‌లో ఇప్పటివరకూ 11 టెస్టులు, మరో 40 అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు ఆడిన హాలెస్ తన సహచరులతో కలసి జనవరిలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కుడి చేతికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్ పర్యటనకు జనవరి 27వ తేదీన ప్రకటించిన జట్టులో హాలెస్‌కు చోటు కల్పించలేదు. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో కొనసాగుతున్న హాలెస్ పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉన్నప్పటికీ గాయం నుంచి చాలా మేరకు కోలుకున్నట్లు రెండవ స్కానింగ్‌లో తేలడంతో వెస్టిండీస్ పర్యటనకు రావలసిందిగా ఇంగ్లాండ్ జాతీయ జట్టు నుంచి అతనికి పిలుపు వచ్చింది. దీంతో హాలెస్ మార్చి 3వ తేదీన కరీబియన్లతో ఆంటిగ్వాలో తొలి వనే్డ మ్యాచ్ ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు ఇంగ్లాండ్ జట్టులో చేరనున్నాడు. ‘మళ్లీ జట్టులో చేరేందుకు వేచి ఉండలేను. రేపే ఆంటిగ్వాకు వచ్చేస్తున్నా’ అని హాలెస్ ట్వీట్ చేయగా, బుధవారం సాయంత్రానికి అతను ఆంటిగ్వాకు చేరుకుంటాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ధ్రువీకరించింది. హాలెస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి మళ్లీ అధికారికంగా జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని ధ్రువీకరణ జరిగే వరకు అతను ఇంగ్లాండ్ జట్టు వెంటే ఉండి రిహాబిలిటేషన్‌ను కొనసాగిస్తాడని ఇసిబి తెలిపింది. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆడనుంది. వీటిలో మార్చి 3, 5 తేదీల్లో జరుగనున్న రెండు మ్యాచ్‌కు ఆంటిగ్వా, మార్చి 9వ తేదీన జరిగే చివరి వనే్డ మ్యాచ్‌కి బార్బడోస్ ఆతిథ్యమివ్వనున్నాయి.

చిత్రం..హాలెస్