క్రీడాభూమి

లోధా సిఫారసులను అంగీకరించేందుకు గడువు పొడిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: లోధా కమిటీ సిఫారసులపై అంగీకార నివేదిక సమర్పించేందుకు నిర్ధేశించిన గడువును మార్చి 27వ తేదీ వరకు పొడిగించాలని వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) పాలక కమిటీ (సిఓఎ)కి విజ్ఞప్తి చేశాయి. దేశంలో క్రికెట్‌ను ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులన్నింటినీ అమలు చేసేందుకు అంగీకారం తెలుపుతూ మార్చి 1వ తేదీ లోగా నివేదికలు సమర్పించాలని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ నేతృత్వంలోని బిసిసిఐ పాలక కమిటీ ఫిబ్రవరి 23వ తేదీన అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు లేఖలు రాసిన విషయం విదితమే. అయితే దీనిపై తమకు మరింత స్పష్టత కావాలని, బిసిసిఐ వ్యవహారాల నిర్వహణా బాధ్యతను కొత్త పాలకవర్గం చేతికి అప్పగించడానికి బదులుగా అసలు ఆ నిర్వహణా బాధ్యతలను పాలక కమిటీయే చేపట్టేందుకు వీలుంటుందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మార్చి 27వ తేదీన విచారణ జరుపనున్నందున లోధా కమిటీ సిఫారసులపై అంగీకార నివేదికల సమర్పణకు నిర్ధేశించిన గడువును మార్చి 27వ తేదీ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ అనర్హత వేటుకు గురైన 20 రాష్ట్రాల క్రికెట్ సంఘాల సభ్యులు బిసిసిఐ పాలక కమిటీకి లేఖలు రాశారు. బిసిసిఐ ఆఫీస్ బేరర్ల మొత్తం పదవీ కాలం 9 సంవత్సరాలా లేక 18 సంవత్సరాలా? అనే దానిపై ఇంకా కొంత స్పష్టత రావలసి ఉందని, అమితాబ్ చౌదరి పిటిషన్‌పై సుప్రీం కోర్టు మార్చి 27వ తేదీన విచారణ జరుపనున్నందున లోధా కమిటీ సిఫారసులపై తాము అంగీకార నివేదికలు సమర్పించేందుకు బిసిసిఐ పాలక కమిటీ అప్పటివరకూ వేచి ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ బిసిసిఐ పాలక కమిటీకి లేఖ రాశామని ఒక రాష్ట్ర క్రికెట్ సంఘానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.