క్రీడాభూమి

కోహ్లీ.. దెబ్బతిన్న పులి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు సాధించడంలో విఫలమైనప్పటికీ ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడన్న విషయం స్పష్టమవుతోంది. ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాటలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయ. పుణె మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులకే పరిమితమైన కోహ్లీని అతను ‘దెబ్బ తిన్న పులి’గా అభివర్ణించాడు. కోహ్లీ ఎంతో విశిష్టమైన ఆటగాడన్న విషయం తమకు బాగా తెలుసని, అతను మళ్లీ ఏ క్షణంలోనైనా విజృంభించడం ఖాయమని స్టార్క్ తమ సహచరులను హెచ్చరించాడు.
**
బెంగళూరు, ఫిబ్రవరి 28: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా పుణేలో ముగిసిన తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో జోరును కొనసాగించడంలో విఫలమైనప్పటికీ ప్రత్యర్థులకు అతనే సింహస్వప్నంగా నిలుస్తున్నాడు. పుణె టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో కోహ్లీ మొత్తం 13 పరుగులు మాత్రమే రాబట్టగలగడంతో ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 1-0 ఆధిక్యత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాతో పాటు సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ కోహ్లీని ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ త్వరగా పెవిలియన్‌కు చేర్చడం టీమిండియా బ్యాటింగ్ విభాగం ఘోరంగా పతనమవడానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. అయితే దెబ్బ తిన్న పులిలా కోహ్లీ తీవ్రస్థాయలో విజృంభించడం ఖాయమని, తొలి టెస్టులో విఫలమైనంత మాత్రాన అతని పట్ల ఉదాసీనతతో వ్యవహరించడం ఏమాత్రం మంచిది కాదని బెంగళూరులో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా జట్టులోని తన సహచర సభ్యులను హెచ్చరించాడు. పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా ఆరంభించకుండానే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే సాధించి నిష్క్రమించడంతో భారత జట్టు ఈ రెండు ఇన్నింగ్స్‌లో మొత్తం 212 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్‌కు వెలుపలి వైపు వేసిన బంతిని ఎదుర్కోవడంలో తడబడిన కోహ్లీ మొదటి స్లిప్‌లో పీటర్ హ్యాండ్స్‌కూంబ్‌కు క్యాచ్ ఇవ్వడం, ఆ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలి పోవడం చక చకా జరిగిపోయాయి.
అయినప్పటికీ ఈ సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌లలో కూడా కోహ్లీ వికెట్‌ను సాధించడమే కీలకమన్న విషయం తమకు తెలుసని, ఈ సిరీస్‌లో తాము ఇంకా ఆరుసార్లు కోహ్లీ వికెట్‌ను సాధించాల్సి ఉందని స్టార్క్ విలేఖరులతో అన్నాడు. ‘తొలి మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీ ఇక మీదట దెబ్బతిన్న పులిలా ఏ క్షణంలోనైనా రెచ్చిపోవడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు’ అని స్టార్క్ స్పష్టం చేశాడు. పుణెలో మీరు సాధించిన రెండు వికెట్లలో పుజారా వికెట్ ప్రాధాన్యమైనదా? లేక కోహ్లీ వికెట్ ప్రాధాన్యమైనదా? అని విలేఖరులు ప్రశ్నించగా, నిస్సందేహంగా పుజారా వికెట్ కంటే కోహ్లీ వికెట్టే ఎంతో కీలకమైనదని స్టార్క్ చెప్పాడు.
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ, స్టార్క్ గతంలో సహచరులుగా ఉన్న విషయం తెలిసిందే. కనుక కోహ్లీ శక్తిసామర్ధ్యాలు ఏమిటో, బ్యాటింగ్‌లో అతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో స్టార్క్‌కు బాగానే తెలుసు. ‘కోహ్లీ ఎంతో సొగసైన ఆటగాడు. ఆ విషయం నాతో పాటు మా జట్టులోని ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. వరుసగా నాలుగు సిరీస్‌లలో డబుల్ సెంచరీలతో విజృంభించిన కోహ్లీ ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో పరుగులు సాధించి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. మళ్లీ విజృంభించకుండా అతడిని ఏమేరకు కట్టడి చేయగలుగుతామన్న దాని గురించే మేము ఆందోళన చెందుతున్నాం’ అని స్టార్క్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 4వ తేదీన బెంగళూరులో ప్రారంభమయ్యే రెండో టెస్టు ముగిసిన తర్వాత ఇరు జట్లు రాంచీలో మూడో టెస్టు, ధర్మశాలలో నాలుగో టెస్టు ఆడనున్నాయి.

చిత్రం..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ