క్రీడాభూమి

రహానేను తప్పించే ప్రసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 2: నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానేను జట్టునుంచి తొలగించే ప్రశే్న లేదని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. పుణెలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రహానే తొలి ఇనంగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేయడం తెలిసిందే. అయితే అంతమాత్రాన రహానేను జట్టులోంచి తప్పించే ప్రసక్తే లేదని కుంబ్లే గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. గత రెండేళ్లుగా రహానే ఎన్నోసార్లు అద్భుతంగా ఆడాడని కూడా కుంబ్లే చెప్పాడు. ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ అందుబాటులో ఉన్నప్పటికీ రహానేపైనే కుంబ్లే విశ్వాసం ఉంచడం గమనార్హం. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరుణ్ నాయర్ బెంచ్‌కే పరిమితం కావడం దురదృష్టకరమని కుంబ్లే వ్యాఖ్యానించాడు. కాగా, జట్టు తుది కూర్పుపై తాము ఇంకా చర్చించలేదని కుంబ్లే చెప్తూ, మొత్తం 16 మందీ అందుబాటులో ఉన్నారని తెలిపాడు. తాము ఎప్పుడు కూడా అయిదుగురు బౌలర్లతో ఆడాలనే అనుకుంటున్నామని అని కుంబ్లే చెప్పాడు. అయితే బెంగళూరు టెస్టుకు జట్టులో అయిదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు మాత్రం నేరుగా సమాధానం చెప్పలేదు. ఒక టెస్టు మ్యాచ్ గెలవడానికి ఏది సరయిన కూర్పు అని భావిస్తామనే దానిపై అదంతా ఆధారపడి ఉంటుందని చెప్పాడు. కాగా, బెంగళూరు పిచ్ ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.