క్రీడాభూమి

టీమిండియా మళ్లీ రాణిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: పుణె టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం పాలయిన కోహ్లీ సేనకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ గట్టి మద్దతుగా నిలిచాడు. ‘గత పది నెలల కాలంలో భారత జట్టు అద్భుతంగా రాణించింది. ప్రతి మ్యాచ్‌నీ గెలిచింది. అయితే ఇప్పుడు వాళ్లు తిరిగి పుంజుకొని గట్టిగా శ్రమించాలి. సొంతగడ్డపైన కూడా ఏ జట్టయినా ఓటమి పాలవుతుంది. గతంలో చాలా జట్లు కూడా ఓటమి పాలయ్యాయి. ఇదే మొదటిసారి కాదు. అయితే బెంగళూరు టెస్టులో కోహ్లీ సేన తిరిగి పుంజుకుని రాణిస్తుందని నేను అనుకుంటున్నాను. సిరీస్‌ను గెలిచే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్, బౌలర్లు జట్టులో ఉన్నారు’ అని గంగూలీ ఒక న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అన్నాడు. అంతేకాదు భారత జట్టు డిఆర్‌ఎస్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని కూడా అభిప్రాయ పడ్డాడు.
ఈ సందర్భంగా గంగూలీ జట్టు సారథి కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. పుణె టెస్టులో కోహ్లీ వైఫల్యం గురించి అడగ్గా, అతను కూడా మానవమాత్రుడేనని గంగూలీ అన్నాడు. అయితే కోహ్లీ తిరిగి రాణించగలడని, ఆ నైపుణ్యం అతనిలో ఉందని కూడా చెప్పాడు. ‘ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో వరసగా అతను సాధించిన సెంచరీలే అందుకు నిదర్శనం. సచిన్ తెండూల్కర్ సైతం అలా ఆడడం నేను చూడలేదు. రెండో సారి పర్యటనలోనే ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాపై వరసగా నాలుగు సెంచరీలు చేయడం ఓ అద్భుతం’ అని అన్నాడు. అంతేకాదు కోహ్లీ నాయకత్వ లక్షణాలను కూడా గంగూలీ ప్రశంసించాడు. పుణె టెస్టు ఓటమి తర్వాత విలేఖరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడిన తీరు తనకెంతో నచ్చిందని చెప్పిన గంగూలీ, అతను దేన్నీ దాచి పెట్టలేదన్నాడు. కోహ్లీ నాయకత్వంపై తనకు బోలెడంత నమ్మకం ఉందని కూడా చెప్పాడు. అదే సమయంలో పుణె పిచ్‌పైన కూడా గంగూలీ విమర్శలు కురిపించాడు. అలాంటి పిచ్‌లను రూపొందించినప్పుడు ఓ మామూలు బౌలర్లకు కూడా అవకాశమిచ్చినట్లవుతుందని అంటూనే అంతమాత్రాన తాను ఒకీఫ్‌ను తక్కువ చేయడం లేదన్నాడు.
మేలు చేసిన టాస్: క్లార్క్
కాగా, పుణె టెస్టులో మాదిరిగా బెంగళూరులో భారత్‌ను ఓడించడం అంత సులభం కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. పుణెలో టాస్ గెలవడం కూడా ఆస్ట్రేలియాకు కలిసి వచ్చిందని ఆయన అభిప్రాయ పడ్డాడు. ఒక వేళ పుణెలో భారత్ గనుక టాస్ గెలిచి ముందు బ్యాట్ చేసి ఉండి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని కూడా అన్నాడు. టాస్‌తో సంబంధం లేకుండా భారత్‌లో గెలవాలంటే ఏ జట్టుకైనా తొలి ఇన్నింగ్స్‌లో 450 పరుగులు చేయడం తప్పనిసరని కూడా క్లార్క్ అభిప్రాయ పడ్డాడు.

చిత్రం.. విరాట్‌కు బాసటగా నిలిచిన ‘బెంగాల్ టైగర్’