క్రీడాభూమి

కేరళ హైకోర్టులో శ్రీశాంత్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మార్చి 3: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో జీవిత కాలం పాటు నిషేధానికి గురైన టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. క్రికెట్ ఆడకుండా తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ శ్రీశాంత్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో అతనిపై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని బిసిసిఐకి కేరళ హైకోర్టు నోటీసు పంపింది. 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 టోర్నమెంట్ సందర్భంగా శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆ కేసును విచారించిన న్యాయస్థానం 2015 జూలైలో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతను స్థానిక టోర్నమెంట్ ద్వారా మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టాలని భావించాడు. అయితే ఇందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (నో అబ్జెక్షన్ సర్ట్ఫికెట్‌ను) ఇచ్చేందుకు బిసిసిఐ నిరాకరించడంతో శ్రీశాంత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.