క్రీడాభూమి

అలాంటి చెత్త ఆటను మళ్లీ చూడరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 3: పుణెలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరపరాజయానికి దారి తీసిన లాంటి‘చెత్త ప్రదర్శన’ను తమ జట్టు పునరావృతం చేయబోదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు హామీ ఇచ్చాడు. అంతేకాదు ఆ ఘోరపరాజయంనుంచి తమ జట్టు గుణపాఠాలు నేర్చుకుందని కూడా ఆయన చెప్పాడు. ‘మరోసారి అలాంటి చెత్త ప్రదర్శనను మీరు చూడరు. ఆ మేరకు నేను హామీ ఇస్తున్నాను’ అని శనివారంనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కోహ్లీ చెప్పాడు. ‘ఓటములను అంగీకరించడం చాలా ముఖ్యం. ఉద్దేశం లేకపోవడం వల్లనే మేము పుణె మ్యాచ్ కోల్పోయాం. ఆస్ట్రేలియా మెరుగైన క్రికెట్ ఆడింది. ఓటమిని అంగీకరించడం ముఖ్యం. అలాకాక అహంకారంతో దాన్ని విస్మరిస్తే నష్టపోయేది నువ్వే. పుణెలో ఓడిపోయినంతమాత్రాన మిగతా మ్యాచ్‌లు కూడా మేము ఓడిపోతామని అర్థం కాదు’ అని కోహ్లీ అన్నాడు. జట్టుకు సంబంధించినంతవరకు అది అరుదైన ఉమ్మడి వైఫల్యమని కూడా అతను చెప్పాడు. ఒక్కోసారి అలాంటి ఓటములు కూడా అవసరమని చెప్పిన అతను ‘మేము ఎక్కడ విఫలమైనామో అర్థం చేసుకొనే వేదికను అది ఇచ్చింది. ఆ పరాజయంనుంచి మేము చాలా నేర్చుకున్నాం’ అని చెప్పాడు. అంతేకాదు, ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా తమ సన్నద్ధత ఒకే విధంగా ఉంటుందని కూడా చెప్పాడు. రెండో టెస్టుకు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయనున్నదీ చెప్పడానికి కోహ్లీ నిరాకరిస్తూ కొన్ని అనూహ్య మార్పులు ఉంటాయని మాత్రం చెప్పాడు.
కాగా, పుణెలో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా, తాము ఏ ఒక్క ఆటగాడిపైనా దృష్టిపెట్టడం లేదని, టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే ఆస్ట్రేలియాపై మొత్తం జట్టు బాగా ఆడాలని చెప్పాడు. సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓటమి కారణంగా భారత జట్టు ఒత్తిడితో ఉందంటూ స్మిత్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ తేలిగ్గా కొట్టి పారేస్తూ, తనపై కానీ, జట్టుపైన కానీ ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలను ‘మైండ్ గేమ్’గా అతను కొట్టిపారేశాడు.