క్రీడాభూమి

పుణెలో గెలుపు గతం : స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 3: పుణెలో భారత్‌లో సాధించిన భారీ విజయం గతించిన అంశమని, శనివారంనుంచి జరిగే రెండో టెస్టులో భారత్‌ను ఎదుర్కోవడానికి కొత్తగా మొదలుపెట్టాలని తాము అనుకుంటున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌పై 333 పరుగుల భారీ ఆదిక్యతతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ 3 రోజుల్లోనే ముగియడం గమనార్హం. అయితే గతం గురించి ఎక్కువగా ఆలోచించడం తమకు ఇష్టం లేదని స్మిత్ చెప్పాడు. అంతేకాదు, భారత జట్టు రెండో టెస్టులో తిరిగి పుంజుకోవడానికి గట్టిగా శ్రమిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పాడు. కాగా, బెంగళూరు పిచ్ పుణె పిచ్‌కన్నా భిన్నంగా ఉంటుదని భావిస్తున్నట్లు చెప్పిన స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో తాము ఎలా బ్యాట్ చేస్తామనే దానిపై తమ భావి ప్రణాళిక ఆధారపడి ఉంటుందని చెప్పాడు. వీలయినంత ఎక్కువ సేపు బ్యాట్ చేసి భారీ స్కోరు చేయడంపైనే తాము దృష్టిపెట్టనున్నట్లు కూడా అతను చెప్పాడు. కాగా, రెండో టెస్టుకు కూడా తమ జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పిన స్మిత్ ఒక వేళ టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పాడు. అంతేకాదు గవాస్కర్-బోర్డర్ ట్రాఫీని తిరిగి గెలుచుకోవడానికి తాము ఒక విజయం దూరంలో ఉన్నామనే విషయం తమకు బాగా తెలుసునని, ఒత్తిడి అంటూ ఏదయినా ఉంటే అది భారత్‌పైనే ఉంటుందని స్మిత్ చెప్పాడు.