క్రీడాభూమి

రెండో టెస్టుకు మురళీ విజయ్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 4: ఆస్ట్రేలియాతో శనివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌కి టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ (32) దూరమయ్యాడు. కంగారూలతో పుణెలో జరిగిన తొలి టెస్టులో భుజానికి తగిలిన గాయం నుంచి మురళీ విజయ్ కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. దీంతో రెండో టెస్టులో అతని స్థానాన్ని అభినవ్ ముకుంద్‌తో భర్తీ చేశారు. పుణె మ్యాచ్‌లో ఫీల్డింగ్ సందర్భంగా బంతి కోసం మురళీ విజయ్ డైవింగ్ చేసినప్పుడు అతని చేయి మెలితిరిగడంతో ఈ గాయమైంది. ఈ గాయం నుంచి అతను కోలుకోలేకపోవడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.