క్రీడాభూమి

మెరిసిన పుజారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 6: ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరుగుతున్న రెండో భారత జట్టు పుంజుకుంది. కంగారూలను దీటుగా ప్రతిఘటిస్తున్న చటేశ్వర్ పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకుని 79 పరుగుల అజేయ స్కోరు సాధించగా, ఓపెనర్ లోకేష్ రాహుల్ వరుసగా మరో అర్ధ శతకంతో అలరించాడు. దీంతో సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 213 పరుగులు సాధించిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల లోటును భర్తీ చేసుకోవడంతో పాటు 126 పరుగుల ఆధిక్యత సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన స్కోరు సాధించి కంగారూలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకుముందు కంగారూలపై మరోసారి విజృంభించిన ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా 63 పరుగులకు 6 వికెట్లు కైవసం చేసుకుని భారత బౌలర్లలో టాప్ వికెట్ టేకర్‌గా నిలవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టుకు నైట్‌వాచ్‌మన్లు మాథ్యూ వేడ్, మిచెల్ స్టార్క్ 49 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం స్టార్క్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు. మరో 3 పరుగుల అనంతరం వరుస బంతుల్లో మాథ్యూ వేడ్ (40), నాథన్ లియోన్ (0) వికెట్లను కైవసం చేసుకున్న రవీంద్ర జడేజా మరో రెండు పరుగులకే జోష్ హాజెల్‌వుడ్ (1)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 122.4 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 87 పరుగుల ఆధిక్యత సాధించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అభినవ్ ముకుంద్ (32 బంతుల్లో 16 పరుగులు) మరోసారి విఫలమై స్వల్పస్కోరుకే నిష్క్రమించినప్పటికీ ఓపెనర్ లోకేష్ రాహుల్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా సమర్ధవంతంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. చక్కటి సమన్వయంతో స్థిమితంగా ఆడిన వీరు చెరో అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని రెండో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత లోకేష్ రాహుల్ (85 బంతుల్లో 51 పరుగులు) స్టీవ్ ఒకీఫ్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (15)తో పాటు థర్డ్‌డౌన్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా (2)లను జోష్ హాజెల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో భారత జట్టు 120 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఫోర్త్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా దిగిన అజింక్యా రహానే అప్పటికే క్రీజ్‌లో నిలదొక్కుకున్న చటేశ్వర్ పుజారాకు చక్కటి సహకారాన్ని అందించాడు. మరో వికెట్ చేజారకుండా చక్కటి సమన్వయంతో ఎంతో జాగ్రత్తగా ఆడిన వీరు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటిస్తూ 93 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు. దీంతో సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 213 పరుగులు సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యత సాధించింది. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్లు కోల్పోకుండా ఒక సెషన్ అంతా ఆడటం ఇదే తొలిసారి. చటేశ్వర్ పుజారా (173 బంతుల్లో 79 పరుగులు), అజింక్యా రహానే (105 బంతుల్లో 40 పరుగులు) మంగళవారం భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించనున్నారు.

చిత్రాలు.. చటేశ్వర్ పుజారా (79 నాటౌట్),
*త్రుటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్న
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (6/63)