క్రీడాభూమి

మెండిస్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, మార్చి 7: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం గాలేలోని అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి రోజే సత్తా చాటుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో ఉపుల్ తరంగ (4), ఓపెనర్ బ్యాట్స్‌మన్ దైముత్ కరుణరత్నె (30), సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ దినేష్ చండీమల్ (5) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కుశల్ మెండిస్ అజేయ శతకంతో విజృంభించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతను చూడముచ్చటైన షాట్లతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అశీల గుణరత్నె (85)తో కలసి నాలుగో వికెట్‌కు 196 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించిన మెండిస్ 242 బంతుల్లో రెండు సిక్సర్లు, మరో 18 ఫోర్ల సహాయంతో 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడు వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా 14 పరుగులతో అజేయంగా నిలవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 321 పరుగులు సాధించిన శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మరింత భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్త్ఫాజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, సుభాశిష్ రాయ్, మెహెదీ హసన్ మిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున రాబట్టారు.

చిత్రం..కుశల్ మెండిస్ (166 నాటౌట్)