క్రీడాభూమి

స్మిత్ తీరుపై కోహ్లీ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 7: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డిఆర్‌ఎస్‌ను ఉపయోగించుకునే విషయంలో మోసపూరితంగా వ్యవహరించాడని ఆరోపించడం ద్వారా విరాట్ కోహ్లీ పెద్ద వివాదానికే తెరదీశాడు. అయితే తాను అలా చేసి ఉండాల్సింది కాదని తప్పు ఒప్పుకోవడం ద్వారా స్మిత్ ఈ వివాదాన్ని చల్లార్చడానికి ప్రయత్నించాడు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ఎల్‌బిడబ్ల్యుగా అవుటయినట్లు అంపైర్ ప్రకటించాడు. అయితే మైదానం వీడి వెళ్లడానికి బదులు స్మిత్ అవతలి ఎండ్‌లో ఉన్న నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి కొద్ది సేపు మాట్లాడాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడు. అప్పటికే ఒకసారి డేవిడ్ వార్నర్ విషయంలో డిఆర్‌ఎస్‌కు వెళ్లి చేతులు కాల్చుకున్నదున మరోసారి డిఆర్‌ఎస్‌కు వెళ్లాలో వద్దో తేల్చుకోలేక స్మిత్ ఆ పని చేశాడు. అయితే ఇది గమనించిన కోహ్లీ వెంటనే అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. నిబంధనల ప్రకారం మైదానంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు డ్రెస్సింగ్ రూమ్‌నుంచి ఎలాంటి సిగ్నల్ అందకూడదు. అయితే దీనికి వ్యతిరేకంగా వ్యవహరించి స్మిత్ క్రీడాస్ఫూర్తికి భంగకరంగా వ్యవహరించాడని మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో అన్నాడు.