క్రీడాభూమి

అప్రమత్తం.. అంతా సిద్ధం.. భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైనా, కశ్యప్ దూరం..
దక్షిణాసియా గేమ్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) తెలిపిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఇద్దరిని మినహాయస్తే, బాడ్మింటన్ విభాగంలో పోటీపడుతున్న పివి సింధు తదితరులంతా శుక్రవారం ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు.
శాగ్‌ను దృష్టిలో ఉంచుకొని అస్సాం, మేఘాలయ ప్రభుత్వాలు కనీవినీ ఎరుగని రీతిలో భారీ భద్రతను కల్పించాయ. కేంద్రం ఏడు కోట్ల రూపాయలను కేవలం భద్రత కోసం అందచేసింది. మొత్తం బడ్జెట్‌లోనూ భద్రతా ఏర్పాట్లకు అయ్యే మొత్తాలను కలపలేదు. అడుగడుగునా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గౌహతి, ఫిబ్రవరి 4: వేర్వేరు కారణాలతో పలుమార్లు వాయిదా పడిన దక్షిణాసియా క్రీడలు (శాగ్) ఎట్టకేలకు శుక్రవారం ఇక్కడి నబీన్ చంద్ర బోర్డోలొయ్ స్టేడియంలో మొదలు కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోటీలను ప్రారంభిస్తారు. 12 రోజులపాటు జరిగే శాగ్‌లో సార్క్‌లోని 8 సభ్య దేశాల నుంచి 2,500 మంది అథ్లెట్లు 228 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. 2010లో చివరిసారి ఢాకాలో శాగ్ జరిగినప్పుడు 157 విభాగాల్లోనే పోటీలను నిర్వహించారు. 2,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అప్పటి శాగ్‌తో పోలిస్తే ఈసారి మరింత భారీగా జరుగుతున్నదనే చెప్పాలి. వాస్తవానికి 12వ గేమ్స్‌ను 2012లో నిర్వహించాల్సి ఉంది. అయితే, అప్పట్లో ఢిల్లీ ఎన్నికలు ఉండడంతో వాయిదా పడ్డాయి. అదే ఏడాది డిసెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్యకాలంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ)పై అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) వేటు వేసింది. ఫలితంగా దక్షిణాసియా క్రీడల నిర్వాహణ సాధ్యం కాలేదు. ఈ నిషేధాన్ని ఐఒసి ఎత్తివేసిన తర్వాత, శాగ్‌ను కేరళలో నిర్వహించాలని అధికారులు భావించారు. కేంద్రం దాదాపుగా ఖాయమైంది. కానీ, చివరి క్షణాల్లో పోటీలను నిర్వహించే పరిస్థితి లేదని కేరళ సర్కారు తేల్చిచెప్పడంతో గేమ్స్ మరోసారి వాయిదా పడ్డాయి. చివరికి గౌహతి, షిల్లాంగ్ నగరాలను సంయుక్త వేదికలుగా నిర్ణయించారు.
గౌహతిలో 16 ఈవెంట్స్
గౌహతిలో మొత్తం 16 ఈవెంట్స్‌లో పోటీలు కొనసాగుతాయి. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షూటింగ్, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిస్, ట్రయథ్లాన్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీలకు గౌహతి ఆతిథ్యమిస్తుంది. కాగా, షిల్లాంగ్‌లో ఆరు (ఆర్చరీ, బాడ్మింటన్, బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, త్వైకాండో, ఉషు, మహిళల ఫుట్‌బాల్) ఈవెంట్స్‌లో పోటీలు ఉంటాయి. బాక్సింగ్‌లో మేరీ కోమ్, షూటింగ్‌లో గగన్ నారంగ్ వంటి మేటి స్టార్లు పోటీపడనున్నారు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ పోటీలకు హాజరవుతుందా కాదా అన్నది ఇంకా ఖరారుకాలేదు.
భారీ బడ్జెట్
ఈసారి శాగ్‌కు భారీ బడ్జెట్‌ను కేటాయించారు. మొత్తం 150 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ఇందులో 60 కోట్ల రూపాయలను కేంద్రం భరిస్తున్నది. మిగతా మొత్తాన్ని అస్సాం, మేఘాలయ ప్రభుత్వాలు ఇస్తాయి. నిర్వాహణ కమిటీకి అస్సాం నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ అధ్యక్ష వహిస్తున్నారు.