క్రీడాభూమి

కుశాల్ చేజారిన ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, మార్చి 8: కుశాల్ మెండిస్ ఆరు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, అతని ప్రతిభకు అసెల గుణరత్నే, నిరోషన్ డిక్‌విల్లా, దిల్‌రువాన్ పెరెనా అర్ధ శతకాలు జత కలవడంతో, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 494 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. నాలుగు వికెట్లకు 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను కొనసాగించిన శ్రీలంక మరో 173 పరుగులు జోడించి, మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. కుశాల్ 285 బంతులు ఎదుర్కొని, 194 పరుగులు చేసి, మెహెదీ హసన్ బౌలింగ్‌లో తమీమ్ ఇక్బాల్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. కేవలం ఆరు పరుగుల తేడాతో అతను డబుల్ సెంచరీని కోల్పోయాడు. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా 75 పరుగులు చేయగా, దిల్‌రువాన్ పెరెరా 51 పరుగులు సాధించాడు. టెయిలెండర్లు నిలకడగా ఆడలేకపోవడంతో, శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 494 పరుగుల వద్ద ముగిసింది. మెహదీ హసన్ 113 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్త్ఫాజుర్ రహ్మాన్ రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 118 పరుగులు జోడించిన తర్వాత తమీమ్ ఇక్బాల్ రనౌటయ్యాడు. అతను 112 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేశాడు. మోనిముల్ హక్ ఏడు పరుగులు చేసి, దిల్‌రువాన్ పెరెరా బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండు వికెట్లకు 133 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్ (66), కెప్టెన్ ముష్ఫికర్ రహీం (1) క్రీజ్‌లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 129.1 ఓవర్లలో 494 ఆలౌట్ (కుశాల్ మెండిస్ 194, అసెల గుణరత్నే 85, నిరోషన్ డిక్‌విల్లా 75, దిల్‌రువాన్ పెరెరా 51, మెహదీ హసన్ 4/113, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/68).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 46 ఓవర్లలో 2 వికెట్లకు 133 (తమీమ్ ఇక్బాల్ 57, సౌమ్య సర్కార్ 66 బ్యాటింగ్).

285 బంతుల మారథాన్ ఇన్నింగ్స్‌లో 194 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు డబుల్ సెంచరీ పూర్తికాకుండానే అవుటైన కుశాల్ మెండిస్