క్రీడాభూమి

ఆ తప్పు నాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: భారత్‌తో బెంగళూరులో జరిగిన రెండో టెస్టు మ్యాచ్, నాలుగోరోజు ఆట సమయంలో చోటు చేసుకున్న వివాదానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, నిజానికి తాను తప్పు చేశానని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ స్పష్టం చేశాడు. జరిగిన సంఘటనలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పొరపాటు ఏమీ లేదని అతను ట్విటర్‌లో వివరణ ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో బంతి వేగంగా దూసుకొచ్చి, స్మిత్ ప్యాడ్స్‌కు తగిలింది. వికెట్లకు అడ్డంగా నిలబడి ఉన్నందున అతను ఎల్‌బి అయ్యాడని ఉమేష్ అప్పీల్ చేశాడు. అంపైర్ సానుకూలంగా స్పందించాడు. అయితే, అంపైర్ నిర్ణయంతో ఏకీభవించని స్మిత్ మైదానాన్ని వీడకుండా, నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్‌కోమ్ వద్దకు వెళ్లి, అతనితో మాట్లాడాడు. ఆతర్వాత, డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయాలా? వద్దా? అనే అంశంపై సలహా ఇస్తారన్న ఉద్దేశంతో డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడు. అక్కడ ఉన్న ఆటగాళ్లుగానీ, సపోర్టింగ్ స్ట్ఫాగానీ డిఆర్‌ఎస్‌కు వెళ్లాల్సిందిగా సూచించకపోవడంతో, పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అయితే, ఈ సంఘటన పట్ల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. డిఆర్‌ఎస్‌ను డ్రెస్సింగ్ రూమ్ అంశంగా మార్చేశాడంటూ స్మిత్‌పై విమర్శలు గుప్పించాడు. డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేసే సమయంలో సంబంధిత ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడకూడదన్న నిబంధనను స్మిత్ పట్టించుకోలేదని, ఈ విషయంపై ఐసిసికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించాడు. కాగా, తాను చేసింది పొరపాటని అంగీకరించిన స్మిత్ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు. కానీ, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఐసిసి కూడా కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. మొత్తం మీద పరిస్థితి తీవ్రతను గమనించిన హ్యాండ్స్‌కోమ్ ఈ సంఘటనకు తానే బాధ్యుడినని ట్వీట్ చేశాడు. డిఆర్‌ఎస్ నిబంధనలు తనకు తెలియవని, అందుకే, డ్రెస్సింగ్ రూమ్ నుంచి సూచన తీసుకోవాల్సిందిగా తనే స్మిత్‌కు సూచించానని అన్నాడు. ఎల్‌బి అప్పీల్‌పై సపోర్టింగ్ స్ట్ఫా, సహచర ఆటగాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆలోచనతోనే తాను సలహా ఇచ్చానని, అందుకే స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడని వివరించాడు. ఈ వివాదానికి తాను కారణమయ్యానని పేర్కొన్నాడు.