క్రీడాభూమి

ఏకపక్ష నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింహామ్, మార్చి 9: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐసిసి చేసిన ప్రకటన పట్ల భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఏకపక్ష నిర్ణయమంటూ ఐసిసిపై ధ్వజమెత్తాడు. ఒక్కో దేశానికి లేదా ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన న్యాయాన్ని అమలు చేస్తున్నదని ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గవాస్కర్ ఆరోపించాడు. స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడని, అందులోనూ అతను ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడని, అందుకే, ఐసిసి చూసీచూడనట్టు వ్యవహరించిందని విమర్శించాడు. ఒకవేళ తర్వాతి రెండు టెస్టుల్లో ఇలాంటి సంఘటనే జరిగి, అందుకు భారత ఆటగాడు బాధ్యుడైనా ఇదే విధంగా స్పందించాలని ఐసిసికి సూచించాడు. డిఆర్‌ఎస్ అప్పీల్‌కు వెళ్లాలా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకోలేక, సపోర్టింగ్ స్ట్ఫా అభిప్రాయం కోసం స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌వైపు పదేపదే చూడడం స్పష్టంగా కనిపించిందని అన్నాడు. ఈ విషయాన్ని ఐసిసి పట్టించుకోకపోవడాన్ని అతను తప్పుపట్టాడు.