క్రీడాభూమి

లోధా సిఫార్సుల్లో ఐపిఎల్ షెడ్యూల్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 6: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై విచారణ అనంతరం సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికలో చేసిన సిఫార్సులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) షెడ్యూల్‌తో ఎలాంటి సంబంధం లేదని టోర్నమెంట్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. శనివారం ఇక్కడ జరిగిన తొమ్మిదో ఐపిఎల్ వేలం కార్యక్రమానికి హాజరైన అతను ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఐపిఎల్ షెడ్యూల్‌ను పాలక మండలే నిర్ణయిస్తుందని తెలిపాడు. టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఏప్రిల్ 3న ముగుస్తుంది. 9 నుంచి ఐపిఎల్ టోర్నీ ఆరంభమవుతుంది. మేజర్ టోర్నీలకు, ఐపిఎల్‌కు మధ్య కనీసం 15 రోజుల విరామం ఉండితీరాలని లోధా కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని శుక్లా తోసిపుచ్చాడు. ఐపిఎల్ షెడ్యూల్‌తో లోధా కమిటీ ప్రతిపాదనలకు సంబంధం లేదన్నాడు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఐపిఎల్ జరుగుతుందని అన్నాడు.

హాకీ ఇండియా లీగ్‌లో ముంబయ సంచలనం
లక్నో, ఫిబ్రవరి 6: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో శనివారం ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాజ్‌లో దబాంగ్ ముంబయ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వరుస పరాజయాలతో అల్లాడిన ముంబయ గత మ్యాచ్‌లో రాంచీ రేస్‌కు షాకిచ్చింది. అదే ఉత్సాహంతో యుపిపైనా అద్భుతంగా పోరాడి గెలిచింది. మ్యాచ్ 8వ నిమిషంలోనే జొహాన్ జొర్క్‌మన్ గోల్ చేసి, బోనస్ గోల్ కూడా అందించాడు. ఫలితంగా 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన ముంబయ ఆతర్వాత నింపాదిగా ఆఢింది. యుపికి గంజాలో పిలట్ గోల్ అందించినప్పటికీ తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

అండర్-19 వరల్డ్ కప్
సెమీస్ చేరిన భారత్
ఫతుల్లా, ఫిబ్రవరి 6: అండర్-19 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌ని 197 పరుగుల భారీ తేడాతో కైవసం చేసుకుంది. యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 96 బంతుల్లో 111 పరుగులు సాధించడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు చేసింది. సర్ఫ్‌రాజ్ ఖాన్ 76 పరుగులతో రాణించాడు. నమీబియా బౌలర్లలో ఫ్రిజ్ కొజీ 78 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 39 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. నికో డావిన్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం ఆ జట్టు పతనాన్ని స్పష్టం చేస్తున్నది. భారత బౌలర్లలో మాయాంగ్ దాగ్ 25 పరుగులకు మూడు, అన్మోల్‌ప్రీత్ సింగ్ 27 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు.
న్యూజిలాండ్‌తో రెండో వనే్డ
ఆసీస్ విజయం
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 6: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వనే్డలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని కివీస్ గెల్చుకోగా, రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు చేసింది. కేన్ విలియమ్‌సన్ (60), సాంట్నర్ (45 నాటౌట్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టడంలో సఫలం కాలేదు. ఆసీస్ బౌలర్లలో జొస్ హాజెల్‌వుడ్ 61 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. బొలాండ్, జంపా, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 46.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (98) దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేయలేకపోయినప్పటికీ, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాజా 950)తో కలిసి తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (2), జార్జి బెయిలీ (0), గ్లేన్ మాక్స్‌వెల్ (6), మాథ్యూ వేడ్ (2) తక్కువ స్కోర్లకే అవుటైనప్పటికీ మిచెల్ మార్ష్ (69 నాటౌట్), హాస్టింగ్స్ (48 నాటౌట్) ఆస్ట్రేలియాను విజపథంలో నడిపించారు.