క్రీడాభూమి

ఉపుల్ తరంగ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, మార్చి 10: శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్నది. మొదటి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్‌లో ఉపుల్ తరంగ శతకంతో రాణించగా, ఆరు వికెట్లకు 274 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్, వర్షం కారణంగా నిర్ణీత సమయానికంటే ముందుగానే ఆటను నిలిపివేసినప్పటికి వికెట్ నష్టం లేకుండా 67 పరుగులు చేసింది. చివరి రోజైన శనివారం నాటి ఆటలో ఈ జట్టు ఇంకా 390 పరుగులు సాధిస్తే విజయాన్ని నమోదు చేస్తుంది. బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని అందుకుటుందా లేక శ్రీలంక బౌలర్లు ఆధిపత్యాన్ని కనబరచి ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తారా అన్నది ఆసక్తిని రేపుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
బంగ్లాదేశ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో పైచేయి సాధించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ స్కోరు సాధించేందుకు ప్రయత్నించింది. 171 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 115 పరుగులు సాధించిన ఉపుల్ తరంగ తన కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేశాడు. దినేష్ చండీమల్ 75 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించి నాటౌట్‌గా నిలిచాడు. దిల్‌రువాన్ పెరెరా 33 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటైన వెంటనే, రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు లంక కెప్టెన్ రంగన హెరాత్ ప్రకటించాడు. అప్పటికి లంక స్కోరు ఆరు వికెట్లకు 274. మొదటి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన కారణంగా, అతను ప్రత్యర్థి ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే అవకాశాలు అంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో, ఆలౌట్ కాకుండా జాగ్రత్తపడి, మ్యాచ్‌ని డ్రా చేసుకోవాలన్న లక్ష్యంతో బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (13 నాటౌట్), కెప్టెన్ సౌమ్య సర్కార్ (53 నాటౌట్) ఆచితూచి బ్యాటింగ్ చేశారు. స్కోరును వికెట్ నష్టం లేకుండా 67 పరుగులకు చేర్చారు. గత రెండు రోజులుగా వేధిస్తున్న వర్షం మరోసారి పలకరించడంతో, నిర్ణీత సమయానికంటే ముందుగానే అంపైర్లు ఆటను నిలిపేశారు. విజయానికి బంగ్లాదేశ్ ఇంకా 390 పరుగులు చేయాలి. పది వికెట్లు పదిలంగా ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 129.1 ఓవర్లలో 494 ఆలౌట్ (కుశాల్ మెండిస్ 194, అసెల గుణరత్నే 85, నిరోషన్ డిక్‌విల్లా 75, దిల్‌రువాన్ పెరెరా 51, మెహదీ హసన్ 4/113, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/68).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 97.2 ఓవర్లలో 312 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 57, సౌమ్య సర్కార్ 71, ముష్ఫికర్ రహీం 85, మెహదీ హసన్ మీర్జా 41, దిల్‌రువాన్ పెరెరా 3/53, రంగన హెరాత్ 3/72).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 69 ఓవర్లలో 6 వికెట్లకు 274 డిక్లేర్డ్ (ఉపుల్ తరంగ 115, దినేష్ చండీమల్ 50, మెహదీ హసన్ మీర్జా 2/77, షకీబ్ అల్ హసన్ 2/104).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 15 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 67 (తమీమ్ ఇక్బాల్ 13 నాటౌట్, సౌమ్య సర్కార్ 53 నాటౌట్).

చిత్రం..ఉపుల్ తరంగ (115)