క్రీడాభూమి

సింధు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 10: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టో ర్నమెంట్‌లో తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సిం ధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్‌తో తలపడిన ఆమె 14-21, 10-21 తేడాతో ఓటమిపాలైంది. ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న సింధు తన కంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్న జూ ఇంగ్‌కు గట్టిపో టీనే ఇచ్చింది. మొదటి సెట్‌లో చాలా సేపు సింధు పోరాటాన్ని కొనసాగిం చింది. ఆ సెట్‌తో పోలిస్తే రెండో సెట్‌లో ఆమె నీరసపడిపోయనట్టు స్ప ష్టంగా కనిపించింది. మరోవైపు జూ ఇంగ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడు తూ, సింధు పాయంట్ల కోసం చేసిన ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకొని, సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

చిత్రం..పివి సింధు