క్రీడాభూమి

వివాదానికి తెరపడినట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: కోహ్లీ, స్మిత్ డిఆర్‌ఎస్ వివాదానికి తెరపడినట్టేనని బిసిసిఐ పాలక కమిటీ (సిఒఎ) సభ్యురాలు, భారత మహిళా క్రికెటర్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అన్నది. శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, డిఆర్‌ఎస్ వివాదాన్ని పరిష్కరించడంలో బిసిసిఐ అద్భుత పాత్ర పోషించిందని ప్రశంసించింది. ఒక అద్భుతమైన మ్యాచ్‌ని చూసిన ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు అదే స్థాయిలో పోరాడతాయన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, మైదానంలో ఉద్రిక్తతలు సహజమని వ్యాఖ్యానించింది. వివాదం ముగిసిందని, ఇక ఇరు జట్లు మ్యాచ్‌లపై దృష్టి కేంద్రీకరిస్తాయని నమ్ముతున్నట్టు తెలిపింది.

చిత్రం.. డయానా ఎడుల్జీ