క్రీడాభూమి

పాకిస్తాన్‌కు ‘సూపర్ వైట్‌వాష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, డిసెంబర్ 1: పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన ఇంగ్లాండ్ జట్టు సోమవారం షార్జాలో ఉత్కంఠ భరితంగా సాగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు సూపర్ ఓవర్ ద్వారా అద్భుత విజయాన్ని అందుకుని పాక్‌కు ‘వైట్‌వాష్’ వేసింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు పరుగుల ఖాతా ఆరంభించకుండానే ఓపెనర్ జాసన్ రాయ్ (0) వికెట్‌ను కోల్పోయినప్పటికీ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ జేమ్స్ విన్సీ, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ జో రూట్ స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించిన తర్వాత జో రూట్ (32) అఫ్రిదీ బౌలింగ్‌లో నిష్క్రమించగా, అతని స్థానంలో వచ్చిన మొరుూన్ అలీ (0) షహీద్ అఫ్రిదీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (15), క్రిస్ ఓక్స్ (37) మినహా ఎవరూ విన్సీకి సరైన సహకారం అందించలేదు. 45 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్ల సహాయంతో 46 పరుగులు సాధించిన విన్సీ చివరి ఓవర్‌లో సొహైల్ తన్వీర్ వేసిన బంతిని ఎదుర్కోబోయి ఉమర్ అక్మల్‌కు క్యాచ్ ఇవ్వగా, డేవిడ్ విల్లే (3), క్రిస్ జోర్డాన్ (0) నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించింది.
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆరంభంలోనే ఘోరంగా తడబడింది. ఓపెనర్లు అహ్మద్ షెహజాద్ (4), రఫతుల్లా మొహ్మద్ (0), మొహమ్మద్ హఫీజ్ (1) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో షోయబ్ మాలిక్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (24)తో కలసి నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. రిజ్వాన్ నిష్క్రమణ తర్వాత ఉమర్ అక్మల్ 4 పరుగులకే వెనుదిరిగినప్పటికీ అతని స్థానంలో వచ్చిన కెప్టెన్ షహీద్ అఫ్రిదీ కొద్దిసేపు స్థిమితంగా ఆడి షోయబ్ మాలిక్‌కు సహకరించాడు. ఆరో వికెట్‌కు వీరు 63 పరుగులు జోడించిన తర్వాత అఫ్రిదీ (29) విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవగా, 54 బతుతుల్లో రెండు సిక్సర్లు, మరో ఎనిమిది ఫోర్ల సహాయంతో 75 పరుగులు సాధించిన మాలిక్ చివరి ఓవర్‌లో ఓక్స్ వేసిన బంతిని ఎదుర్కోబోయి శామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత సొహైల్ తన్వీర్ (10), అన్వర్ అలీ (0) నాటౌట్‌గా నిలువడంతో పాకిస్తాన్ జట్టు కూడా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 154 పరుగులే సాధించింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. క్రిస్ జోర్డాన్ వేసిన సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ కేవలం 3 పరుగులే సాధించగా, ఇంగ్లాండ్ జట్టు 4 బంతుల్లోనే లక్ష్యాన్ని అధిగమించి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
ఈ సిరీస్‌లో ఇంతకుముందు దుబాయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన ఇంగ్లాండ్ జట్టు రెండో మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు