క్రీడాభూమి

భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, ఫిబ్రవరి 6: దక్షిణాఫ్రికా గేమ్స్ (శాగ్)లో భారత్ శుభారంభం చేసింది. మొదటి రోజునే 14 స్వర్ణాలు, ఐదు రజత పతకాలతో సత్తా చాటింది. పలు విభాగాల్లో పతకాలను ఇప్పటికే ఖాయం చేసుకోగా, మరికొన్ని అంశాల్లో విజయాల దిశగా పరుగులు తీస్తున్నది.
ఆర్చరీ: ఆర్చరీలో నాలుగు స్వర్ణం, మరో నాలుగు రజత పతకాలను ఖాయం చేసుకుంది. ఉదయం జరిగిన పోటీల్లో రణ్‌దీప్ రాయ్, గురుచరణ్ బెస్రా, దీపికా కుమారి, బొంబాల్యా దేవి తమతమ విభాగాల్లో ఫైనల్ చేరి, పతకాలను ఖరారు చేసుకున్నారు. మధ్యాహ్నం సెషన్‌లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, పుర్వాషా షిండే, జ్యోతి సురేఖ కూడా తమతమ విభాగాల్లో ఫైనల్ చేరారు. దీనితో భారత్‌కు ఖచ్చితంగా నాలుగు స్వర్ణాలు, మరో నాలుగు రజతాలు లభించనున్నాయి.
స్విమ్మింగ్: స్విమ్మింగ్‌లో భారత్ ఏడు పతకాలను గెల్చుకుంది. వీటిలో నాలుగు స్వర్ణంకాగా, మూడు రజతం. ఈ క్రమంలోనే మూడు రికార్డులు కూడా నమోదయ్యాయి. పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్, మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివానీ కతారియా తమతమ విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధిస్తూ, గేమ్స్ రికార్డులను కూడా నెలకొల్పారు. అదే విధంగా మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో భారత జట్టు రికార్డు టైమింగ్‌తో స్వర్ణ పతకాన్ని అందుకుంది.
సైక్లింగ్: సైక్లింగ్‌లో భారత్ అద్భుత ప్రతిభ కనబరచింది. శనివారం నాటి పోటీలో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకుంది. మహిళల 30 కిలోమీటర్ల ఇండివిజువల్ టైమ్ ట్రైల్‌లో బిద్యాలక్ష్మి తౌరంగ్మామ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, చవోబా దేవీ ధలాంగ్మమ్‌కు రజత పతకం లభించింది. పాకిస్తాన్‌కు చెందిన సాహిబా బీబి కాంస్య పతకాన్ని అందుకుంది. పురుషుల 40 మీటర్ల ఇండివిజువల్ టైమ్ ట్రయల్‌లోనూ భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. అరవింద్ పన్వార్ 52 నిమిషాల, 28.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. మన్జీత్ సింగ్‌కు రజత పతకం లభించింది. జనకా హెమంతా కుమార (శ్రీలంక) కాంస్య పతకాన్ని సాధించాడు.
రెజ్లింగ్‌లో ఐదు స్వర్ణాలు: రెజ్లింగ్‌లో భారత్ తిరుగులేని ప్రతిభ కనబరచింది. ఒకే రోజు ఐదు స్వర్ణ పతకాలను గెల్చుకొని, తనకు తిరుగులేదని నిరూపించింది. పురుషుల 65 కిలోల విభాగంలో రజనీష్, 57 కిలోల విభాగంలో రవీందర్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాడు. అదే విధంగా మహిళల విభాగంలో ప్రియాంక సింగ్ (48 కిలోలు), మనీష (60 కిలోలు), అర్చనా తోమర్ (55 కిలోలు) విజేతలుగా నిలిచారు.
హాకీ: భారత్ హాకీలో తన పోరాటాన్ని ఆదివారం మొదలుపెట్టనుంది.బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ని ఆడనున్న భారత్ ఫెవరిట్‌గా బరిలోకి దిగుతుండగా, గట్టిపోటీని ఇవ్వడానికి బంగ్లాదేశ్ సన్నాహాలు చేస్తున్నది. మహిళల విభాగంలోనూ భారత్ పోరాటం ఆదివారం నుంచే ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను భారత్ ఢీ కొంటుంది.

మహిళల 30 కిలోమీటర్ల సైకిల్ రేస్‌లో రజత పతకం సాధించిన చవోబా దేవీ ఎలాంగ్మమ్ (ఎడమ),
స్వర్ణ పతక విజేత బిద్యాలక్ష్మి తౌరంగ్మామ్