క్రీడాభూమి

హాకీ ప్రాబబుల్స్ జాబితాలో రఘునాథ్ పేరు గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: బెంగళూరులో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న జాతీయ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం ప్రకటించిన 33 మంది ప్రాబబుల్స్ జాబితాలో సీనియర్ ఆటగాడు విఆర్ రఘునాథ్ పేరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అతని పేరు పొరపాటున గల్లంతైందా లేక హెచ్‌ఐ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తొలగించారా అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించడం లేదు. అయితే, జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అతనికి ప్రాబబుల్స్‌లో చోటు దక్కకపోవడం అనే ప్రసక్తే లేదని, బహుశా పొరపాటున అతని పేరును అధికారులు చేర్చకపోయి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగా, ఈ జాబితాలో పిఆర్ శ్రీజేష్, సర్దార్ సింగ్, రూపీందర్‌పాల్ సింగ్, ఎస్వీ సునీల్, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, ఎస్‌కె ఉతప్ప, చింగ్లెన్‌సనా సింగ్, తల్వీందర్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, సురేందర్ కుమార్, మన్‌ప్రీత్‌సింగ్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఇటీవల జూనియర్ ప్రపంచ కప్‌ను సాధించిన జట్టులోని 11 మందికి కూడా ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కడం విశేషం.