క్రీడాభూమి

భారత క్రికెట్ బోర్డు డిఫెన్సివ్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: డిఆర్‌ఎస్ వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. పరిస్థితి విషమించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్‌తో బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీ సమావేశమై చర్చించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఫిర్యాదు చేయడం ద్వారా ఎంత వరకైనా వెళతామని పరోక్షంగా హెచ్చరిస్తూనే, ఆ ఫిర్యాదును ఉపసంహరించుకొని, ఘర్షణ తమ వైఖరి కాదన్న సందేశాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేకపోయినా, ప్రస్తుతానికి మాత్రం సమస్యకు తెరపడిందనే అనుకోవాలి. బెంగళూరులో జరిగిన రెండో టెస్టు సందర్భంగా డిఆర్‌ఎస్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకానేక సమస్యల్లో మునిగితేలుతున్న బిసిసిఐకి కొత్త సమస్యలను తలకెత్తుకునే పరిస్థితి లేదు. ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూనే, సిఎ అధికారులతో అత్యంత రక్షణాత్మక విధానాన్ని అనుసరించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ‘బుద్ధిక్షయం’ వివాదంగా మీడియా అభివర్ణిస్తున్న ఈ వివాదానికి తెరపడిందని రెండు క్రికెట్ బోర్డులు ప్రకటించడం వెనుక రాహుల్ జోహ్రీ కీలక పాత్ర పోషించాడన్నది వాస్తవం. మైదానంలో కోహ్లీ దూకుడుగా ఉంటాడు కాబట్టి, కొత్తకొత్త వివాదాలు ఏ క్షణంలోనైనా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అయితే, సిరీస్ జరుగుతున్నప్పుడు, రెండు క్రికెట్ బోర్డులు కూడా వివాదాన్ని పెంచుకుంటూపోతే, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలగడమేగాక, దానీ ప్రభావం ఆటగాళ్లపై పడుతుందనేది వాస్తవం. అందుకే, బిసిసిఐ ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించింది. కోహ్లీకి మద్దతునిస్తూనే, ఆస్ట్రేలియాతో రాజీ మార్గాన్ని అనుసరించింది.
వివాదం ముగిసినట్టేనా?
బిసిసిఐ చాకచక్యంగా వ్యవహరించడంతో డిఆర్‌ఎస్ వివాదం ముగిసినట్టేనా? లేక దీని ప్రభావంతో వివాదాల పర్వం కొనసాగుతుందా? అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. సిఎ అధికారుల విషయం ఎలావున్నా, ఆస్ట్రేలియా మీడియా చేస్తున్న హంగామాను చూస్తే, రెండు జట్ల మధ్య ఘర్షణలు తప్పకపోవచ్చన్న అనుమానం తలెత్తుతున్నది. సిఎ అధికారిపైకి కోహ్లీ ఎనర్జీ డ్రింక్ బాటిల్‌ను విసిరేశాడని ఆసీస్ మీడియాలో వచ్చిన వార్తా కథనం సంచలనం సృష్టిస్తున్నది. అంతటితో ఆగకుండా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ అవుట్‌పై వివరణ కోరేందుకు, ముందస్తు అనుమతి తీసుకోకుండానే స్టేడియంలోని అధికారుల బాక్స్‌లోకి భారత కోచ్ అనిల్ కుంబ్లే దూసుకెళ్లాడని మరో వార్తా కథనాన్ని ప్రచారం చేసింది. డిఆర్‌ఎస్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోమ్‌పై ఐసిసికి చేసిన ఫిర్యాదును బిసిసిఐ వాపసు తీసుకోవడంతో, రెండు జట్ల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆసీస్ వార్తా పత్రికలు సరికొత్త కథనాలతో హోరెత్తించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సిఎ అధికారిపై కోహ్లీ బాటిల్‌ను విసిరాడని, అధికారుల బాక్స్‌లోకి కుంబ్లే వెళ్లాడని పేర్కొంటూ, గతంలో భారత ఆటగాడు హర్భజన్ సింగ్ జాత్యంహంకార వ్యాఖ్యలు చేశాడని గుర్తుచేసింది. ఆండ్రూ సైమండ్స్‌ను భజ్జీ వెక్కిరించాడని, ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారత క్రికెటర్లు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వివాదానికి దిగుతున్నారని ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వంటి పత్రికలు గగ్గోలుపెట్టాయి. ఎప్పుడో తెరపడిన వివాదానికి జీవం పోయడం ద్వారా వివాదాల విందును వండి వార్చాయి. కోహ్లీ దూకుడును, మైదానంలో అతని ప్రవర్తనను శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ విమర్శించిన విషయాన్ని కూడా ఆసీస్ మీడియా ప్రస్తావించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న రణతుంగ విమర్శించడంటే కోహ్లీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదని వ్యాఖ్యానించాయి. ఆస్ట్రేలియా మీడియా వైఖరిని చూస్తుంటే, ఈ డిఆర్‌ఎస్ వివాదం ఇంత త్వరగా సద్దుమణగడం ఎంత మాత్రం ఇష్టం లేనట్టు స్పష్టమవుతున్నది.