క్రీడాభూమి

ప్రతిభను ప్రోత్సహించడానికే అకాడమీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: ప్రతిభను ప్రోత్సహించి, అత్యుత్తమ క్రీడాకాలను అందించేందుకే అకాడమీని ఏర్పాటు చేసినట్టు భారత బాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తెలిపింది. శనివారం హైదరాబాద్‌లో గ్లోబల్ అకాడమీని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి అకాడెమీలో శిక్షణ మొదలవుతుందని తెలిపింది. దేశంలో బాడ్మింటన్‌కు ఎంతో ఆదరణ ఉందని, ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని పేర్కొంది. ప్రతిభావంతులను గుర్తించి, వారికి అత్యుత్తమ శిక్షణను ఇస్తామని తెలిపింది. హైదరాబాద్ అకాడెమీలో ఇద్దరు కోచ్‌లు ఉంటారని, ఒక్కో కోచ్ 20 మందికి శిక్షణనిస్తారని వివరించింది. భవిష్యత్తులో ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో అకాడమీలను నెలకొల్పనున్నట్టు జ్వాలా ప్రకటించింది. మొత్తం మీద 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 50 కేంద్రాలను ఏర్పాటు చేస్తానని తెలిపింది.