క్రీడాభూమి

రంగన హెరాత్ రికార్డు స్పెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, మార్చి 11: రంగన హెరాత్ విజృంభణతో బంగ్లాదేశ్ విలవిల్లాడింది. డ్రా కోసం చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 197 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం బౌలర్లలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన హెరాత్ ఆరు వికెట్లు పడగొట్టి, శ్రీలంకకు 259 పరుగుల భారీ విజయాన్ని సాధించిపెట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో494 పరుగుల భారీ స్కోరు చేసిన శ్రీలంక ఆతర్వాత బంగ్లాదేశ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్ చేసింది. 182 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లను ఆరు వికెట్లకు 224 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని లక్ష్యాన్ని ఛేదించడానికి, వికెట్ నష్టం లేకుండా 67 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజైన శనివారం ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ మొదటి ఓవర్ రెండో బంతికే సౌమ్య సర్కార్ వికెట్‌ను కోల్పోయింది. అతను 49 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేసి, అసెల గుణరత్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ ముష్ఫికర్ రహీం (34), లోయర్ మిడిల్ ఆర్డర్‌లో లిటన్ దాస్ (35), మెహదీ హసన్ మీర్జా (28) తప్ప మిగతా వారు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడంలో విఫలమై, ఒకరి తర్వాత మరొకరిగా అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 167 పరుగుల వద్ద ముగిసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై లంక 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 129.1 ఓవర్లలో 494 ఆలౌట్ (కుశాల్ మెండిస్ 194, అసెల గుణరత్నే 85, నిరోషన్ డిక్‌విల్లా 75, దిల్‌రువాన్ పెరెరా 51, మెహ దీ హసన్ 4/113, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/68).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 97.2 ఓవర్లలో 312 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 57, సౌమ్య సర్కార్ 71, ముష్ఫికర్ రహీం 85, మెహదీ హసన్ మీర్జా 41, దిల్‌రువాన్ పెరెరా 3/53, రంగన హెరాత్ 3/72).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 69 ఓవర్లలో 6 వికెట్లకు 274 డిక్లేర్డ్ (ఉపుల్ తరంగ 115, దినేష్ చండీమల్ 50, మెహదీ హసన్ మీర్జా 2/77, షకీబ్ అల్ హసన్ 2/104).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 67): 60.2 ఓవర్లలో 197 ఆలౌట్ (సౌమ్య సర్కార్ 53, ముష్ఫికర్ రహీం 34, లిటన్ దాస్ 35, మెహదీ హసన్ మీర్జా 28, రంగన హెరాత్ 6/59).

ఎడమచేతి వాటం స్పిన్నర్లలో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా డానియల్ వెట్టోరీ (న్యూజిలాండ్) పేరుమీద ఉన్న రికార్డును రంగన హెరాత్ అధిగమించాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులిచ్చి, ఆరు వికెట్లు పడగొట్టడంతో అతని ఖాతాలో ఇప్పుడు 363 వికెట్లు ఉన్నాయి. కాగా, ఎడమచేతి వాటం బౌలర్లలో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ వసీం అక్రం. అతను మొత్తం 414 వికెట్లు కూల్చాడు.

డ్రా దిశగా డ్యునెడిన్ టెస్టు
డ్యునెడిన్, మార్చి 11: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా అడుగులేస్తున్నది. మ్యాచ్ నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 224 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికాకు 191 పరుగుల ఆధిక్యం ఉంది. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో స్టెఫెన్ కుక్ (0) వికెట్‌ను కోల్పోయి 38 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు ఆటలో 186 పరుగులు జోడించి, ఐదు వికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన డీన్ ఎల్గార్ 249 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లతో 89 పరుగులు చేసి అవుటయ్యాడు. అతను 11 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకోగా, కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ 56 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి అతనితోపాటు వెర్నన్ ఫిలాండర్ (1) అతనికి తోడుగా క్రీజ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో వాగ్నర్, పటేల్ చెరి రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 122.4 ఓవర్లలో 308 ఆలౌట్ (డీన్ ఎల్గార్ 140, ఫఫ్ డు ప్లెసిస్ 52, టెంబా బవూమా 64, ట్రెంట్ బౌల్ట్ 4/64, నీల్ వాగ్నర్ 3/88, జీతన్ పటేల్ 2/85).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 114.3 ఓవర్లలో 341 ఆలౌట్ (కేన్ విలియమ్‌సన్ 130, జీత్ రావల్ 52, బ్రాడ్లే వాల్టింగ్ 50, కేశవ్ మహారాజ్ 5/94, వెర్నన్ ఫిలాండర్ 2/67, మోర్న్ మోర్కెల్ 2/62).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 102 ఓవర్లలో 6 వికెట్లకు 224 (డీన్ ఎల్గార్ 89, జీన్ పాల్ డుమినీ 39, ఫఫ్ డుప్లెసిస్ 56 నాటౌట్, నీల్ వాగ్నర్ 2/57, జీతన్ పటేల్ 2/72).