క్రీడాభూమి

కేలా డే సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 11: స్థానిక టీనేజర్ కేలా డే ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీ ఫైనలిస్టు మిర్జానా లూసిక్ బరోనీతో జరిగిన మ్యాచ్‌ని 17 ఏళ్ల కేలా డే ఎవరూ ఊహించని రీతిలో 6-4, 5-7, 7-5 తేడాతో గెల్చుకొని, మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. మొదటి సెట్‌ను సులభంగానే తన ఖాతాలో వేసుకున్న ఆమెకు రెండో సెట్‌లో లూసిక్ బరోనీతో గట్టిపోటీ ఎదురైంది. తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆ సెట్‌ను కోల్పోయింది. దీనితో చివరిదైన మూడో సెట్ అత్యంత కీలకంగా మారింది. విజయం కోసం ఇరువురు సర్వశక్తులు కేంద్రీకరించడంతో పోరు తీవ్ర స్థాయిలో కొనసాగింది. చివరికి ఆ సెట్‌ను కేలా డే తన ఖాతాలో వేసుకొని, మూడో రౌండ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత గార్బినె ముగురుజాతో పోరాటాన్ని ఖరారు చేసుకుంది. అంతకు ముందు జరిగిన రెండో రౌండ్‌లో మ్యాచ్‌లో ముగురుజా 6-2, 6-3 ఆధిక్యంతో కిర్‌స్టెన్ ఫ్లికెన్స్‌ను 6-2, 6-3 ఆధిక్యంతో చిత్తుచేసింది. రెండో రౌండ్‌లో జరిగిన ఇతర కీలక మ్యాచ్‌ల్లో మోనికా పెగ్‌ను కరోలినా ప్లిస్కోవా 1-6, 6-4, 6-4 తేడాతో ఓడించగా, ఇరినా కామెల్లా బెగు 6-1, 7-5 స్కోరుతో లూసా చిరికోపై విజయం సాధించింది. ఎలినా స్విటోలినా 3-6, 6-3, 7-6 తేడాతో క్వియాంగ్ వాన్‌పై గెలిచింది. యానినా విక్‌మేయర్‌పై డరియా గవ్రిలోవా 6-2, 7-6 తేడాతో విజయం సాధించింది. జెలెనా ఒస్టాపెకోను డామినియ్ సిబుల్కొవా 6-4, 3-6, 6-3, అనెట్ కన్టోవిచ్‌ను అనస్తాసియా పవ్లిచెన్కొవా 6-4, 6-4, సారా ఎరానీని బార్బరా స్ట్రికోవా 6-4, 5-7, 6-2, హీతర్ వాట్సన్‌ను జొహన్నా కొన్టా 6-4, 6-4, జొహన్నా లూయిస్‌ను స్వెట్లానా కుజ్నెత్సొవా ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. ఇలావుంటే, గాయం కారణంగా ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ వైదొలగడంతో, మహిళల విభాగంలో టైటిల్ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిని రేపుతున్నది. అయతే, ఆమె పాల్గొనకపోవడం అభిమానులను నిరాశపరుస్తున్నది. సెరెనా మోకాలి గాయంతో బాధపడుతున్నదని, పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమె ఇండిన్ వెల్స్, మియామీ టోర్నీ నుంచి వైదొలగిందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో తన సోదరి సెరెనా విలియమ్స్‌ను ఓడించి, కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్న తర్వాత సెరెనా ఇప్పటి వరకూ ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌ను బాయ్‌కాట్ చేసిన ఆమె ఆతర్వాత మనసు మార్చుకొని 2015లో మళ్లీ ఈ పోటీల్లోకి అడుగుపెట్టింది. నిరుడు ఫైనల్ చేరుకున్నప్పటికీ, టైటిల్‌ను సాధించలేక, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. ఈసారి మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమైంది.

చిత్రం... టీనేజ్ సంచలనం
కేలా డే

బొపన్న అవుట్

* పురుషుల డబుల్స్‌లో ఉరుగ్వే ఆటగాడు పాబ్లో క్యువాస్‌తో కలిసి బరిలోకి దిగిన భారత ఆటగాడు రోహన్ బొపన్న మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. నొవాక్ జొకోవిచ్, విక్టర్ ట్రయికీ జోడీతో తలపడిన బొపన్న, క్యువాస్ 2-6, 6-3, 7-10 తేడాతో ఓటమిపాలయ్యారు.