క్రీడాభూమి

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మొదటి టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యునెడిన్, మార్చి 12: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం నాటి ఆట వర్షం కారణంగా రద్దుకావడంతో, మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశమే లేకుండాపోయింది. మొదట భారీ వర్షం, ఆతర్వాత అవుట్‌ఫీల్డ్ బురదమయం కావడం చివరి రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడకుండా ఆడ్డుకున్నాయి. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 341 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్పంగా వెనుకబడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 224 పరుగులు చేసింది. ఒకవేళ చివరి రోజు ఆట జరిగిన్నా ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది. ఆ కనీన ఉత్కంఠకు కూడా తావులేకుండా, అభిమానుల ఉత్సాహంపై వర్షం నీళ్లు చల్లింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు వెల్లింగ్టన్‌లో ఈనెల 16 నుంచి మొదలవుతుంది.