క్రీడాభూమి

స్టొసుర్‌కు జూలియా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌ను మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో జూలియా జార్జస్ దెబ్బతీసింది. మొదటి సెట్‌ను 4-6 తేడాతో చేజార్చుకున్న ఆమె ఎవరూ ఊహించని విధంగా ఫామ్‌లోకి వచ్చింది. మిగతా రెండు సెట్లను 6-4, 6-4 తేడాతో తన ఖాతాలో వేసుకోవడంతో స్టొసుర్ నిష్క్రమించింది. ఇతర కీలక మ్యాచ్‌ల్లో, లూసీ సఫరోవా 4-6, 6-4, 6-1 ఆధిక్యంతో కొకొ వాండెవాగ్‌ను ఓడించింది. ఎలెనా వెస్నినా 6-4, 7-5 ఆధిక్యంతో షెల్బీ రోజర్స్‌పై గెలిచింది. సిమోనా హాలెప్ 6-4, 6-1 స్కోరుతో డొన్నా వెకిక్‌పై విజయం సాధించింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ 1-6, 7-6, 6-1 తేడాతో జజెలెనా జన్కొవిచ్‌పై గెలుపొంది మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-3, 6-4 తేడాతో సారా సొరిబెర్ టొర్మోను ఓడించింది. కరోలిన్ వొజ్నియాకి 6-3, 6-0 తేడాతో మగ్దా లినెట్‌ను, అంకే కెర్బర్ 6-2, 6-1 ఆధిక్యంతో ఆండ్రియా పెట్కోవిచ్‌ను ఓడించి మూడో రౌండ్ చేరింది.

చిత్రం.. జూలియా