క్రీడాభూమి

ముర్రేకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 12: ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రేకు చుక్కెదురైంది. కెనడాకు చెందిన యువ ఆటగాడు వాసెక్ పొస్పిసిల్ 6-4, 7-6 తేడాతో వరుస సెట్లలో ముర్రేను ఓడించి సంచలనం సృష్టించాడు. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ముర్రే మొదటి సెట్‌లో ప్రత్యర్థిని చాలా తేలిగ్గా తీసుకున్నట్టు కనిపించింది. ఆటపై సరైన దృష్టి కేంద్రీకరించకుండా ఆడిన అతను పదేపదే పొరపాట్లు చేసి, ఓటమిని కొనితెచ్చుకున్నాడు. తొలి సెట్‌ను కోల్పోయిన తర్వాత అతను దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొదటి సెట్‌లో గెలిచిన ఉత్సాహంతో పొస్పిసిల్ రెండో సెట్‌లో మరింతగా చెలరేగాడు. ముర్రే లాంటి ఆటగాడు ఎంత శ్రమించినా గెలవలేకపోయాడంటే, అతని విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు. మరో మ్యాచ్‌లో డూసన్ లజోవిచ్ 6-2, 4-6, 7-6 తేడాతో ఫెలిసియానో లొపెజ్‌పై గెలిచాడు. రాబర్టో బటిస్టా అగుట్ 7-5, 6-2 తేడాతో ఆడ్రియన్ వౌరినోను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. డేవిడ్ గోఫిన్ కూడా ముందంజ వేశాడు. అతను రెండో సెట్‌లో కరెన్ హాచనొవ్‌పై 6-4, 3-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఫాబ్లో ఫొగ్నినీ 7-6, 3-6, 6-4 తేడాతో జో విల్‌ఫ్రైడ్ సొంగాను ఇంటిదారి పట్టించాడు. స్టానిస్లాస్ వావ్రిన్కా 6-3, 6-4 స్కోరుతో పాబ్లో లోరెన్జీని ఓడించాడు. మరో మ్యాచ్‌లో ఫిలిప్ కొల్చెబర్గర్ తన ప్రత్యర్థి అలెగ్జాండర్ డొజొపొలొవ్‌పై మొదటి సెట్‌ను 7-6 తేడాతో గెల్చుకున్నాడు. రెండో సెట్‌లో ఇరువురు చెరొక పాయింట్‌తో సమవుజ్జీగా నిలిచారు. ఈ దశలో కండరాలు బెణకడంతో డొజొపొలొవ్ మ్యాచ్ నుంచి వైదొలగ్గా, కొల్చెబర్గర్ మూడో రౌండ్ చేరాడు. థామస్ బెర్డిచ్ 7-6, 6-4 తెడాతో జాన్ ఫ్రాంటాంజెలోపై గెలిచాడు. మరో కీలక మ్యాచ్‌లో జాన్ ఇస్నర్ 7-6, 7-6 తేడాతో మైఖేల్ కుకుష్కిన్‌పై విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు.

చిత్రం..వాసెక్ పొస్పిసిల్