క్రీడాభూమి

భారత అండర్-23 జట్టుకు విశాఖ క్రికెటర్ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 12: విశాఖ జిల్లా ఆల్‌రౌండర్ కెవి శశికాంత్ భారత అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆంధ్రా జట్టులో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న శశికాంత్ సెలక్టర్లను ఆకట్టుకుని జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఢాకా (బంగ్లాదేశ్)లో ఈనెల చివరి వారంలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్స్ (ఎసిసి) ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్‌లో శశికాంత్ భారత అండర్-23 జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. బిఎ ఫైనలియర్ చదువుతున్న 21 ఏళ్ల శశికాంత్ ఇటీవల జరిగిన సికె నాయుడు ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. ఏడు మ్యాచుల్లో అతను 34 వికెట్లు, 180 పరుగులు చేయడంతో పాటు గుజరాత్ జట్టును ఓడించి ఆంధ్రా ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. టైటిల్ పోరులో పంజాబ్ చేతిలో ఆంధ్రా ఓడినప్పటికీ, శశికాంత్ మాత్రం తన అద్వితీయ పోరాట ప్రతిభతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. కాగా, ఎనిమిది జట్లు పోటీపడే ఎమర్జింగ్ కప్ పోటీల్లో తమిళనాడు ఆటగాడు బాబా అపరాజిత్ నాయకత్వంలో శశికాంత్ భారత జట్టు తరఫున ఆడనున్నాడు.
సత్తా చాటుకుంటా
తాను ఒక మంచి క్రికెటర్‌గా నిరూపించుకునే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆల్‌రౌండర్‌గా మరోసారి తన సత్తా చాటుకుంటానని శశికాంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఆలిండియా రంజీ ట్రోఫీ గ్రూప్-సి పోటీల్లో రెండేళ్లుగా ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ-20 ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆంధ్రా రంజీ జట్టు తరఫున ఆడానని వివరించాడు. ఈ ఎమర్జింగ్ కప్ టోర్నమెంట్‌లో బాల్, బ్యాట్‌తో రాణిస్తాననే నమ్మకం ఉందని అన్నాడు. గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో బంతిని సరైన దిశలో వేయడం తన ప్రత్యేకతగా అని ఆరడుగుల శశికాంత్ చెప్పాడు. బౌలింగ్‌లో గ్లేన్ మెక్‌గ్రాత్, డేల్ స్టెయిన్, బ్యాటింగ్‌లో సచిన్ తెండూల్కర్ అంటే ఇష్టమని అన్నాడు. టీమిండియాకు ఆడాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పాడు. దేశంలోని ప్రముఖ యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లతో అపరాజిత్ నాయకత్వంలో ఈ టోర్నమెంట్‌లో ఆడడం తనకు ఎంతో లాభిస్తుందని, ఎన్నో కొత్త మెళకువలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నాడు.

చిత్రం.. శశికాంత్