క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు ముగురుజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంక్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా (స్పెయిన్) ప్రీ క్వార్టర్స్ చేరింది. ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన ఆమె ఇక్కడ మూడో రౌండ్‌లో కేలా డేను 3-6, 7-5, 6-2 తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనలిస్టు మిర్జానా లూసిక్ బరోనీని ఇంటిదారి పట్టించి సంచలనం సృష్టించిన 17 ఏళ్ల కేలా డే మొదటి రౌండ్‌లో ముగురుజాపై ఒత్తిడి తెచ్చి గెలిచింది. అయితే, తర్వాతి రెండు సెట్లలో అదే స్థాయిలో ఆడలేకపోయింది. మరోవైపు అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఉన్న తన అనుభవాన్ని ఉపయోగించిన ముగురుజా ఎంతో సంయమనంతో ఆడుతూ, మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో కరోలినా ప్లిస్కోవా 6-4, 7-6 స్కోరుతో ఇరినా కామెల్లా బెగూను ఓడించగా, ఎలినా స్విటోలినా 6-2, 6-1 ఆధిక్యంతో డరియా గవ్రిలోవాపై విజయం సాధించింది. టిమియా బస్కిన్‌స్కీ 6-3, 5-7, 7-6 తేడాతో కికీ బెర్టెన్స్‌కు షాకిచ్చింది. డొమినిస్కా సిబుల్కొవా 2-6, 7-6, 7-6 తేడాతో క్రిస్టినా ప్లిస్కోవాను, అనస్తాషియా పవ్లిచెన్కోవా 6-3, 6-2 ఆధిక్యంతో బార్బరా స్ట్రయికోవాను, కరోలిన్ గార్సియా 3-6, 6-3, 7-6 తేడాతో జొహన్నా కొన్టాను, స్వెత్లానా కుజ్నెత్సొవా 6-2, 2-6, 6-1 స్కోరుతో రాబర్టా విన్సీని ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరారు.

చిత్రం..గార్బిన్ ముగురుజా