క్రీడాభూమి

మూడో టెస్టులో ఆడతా: లియాన్ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 13: భారత్‌తో ఈనెల 16 నుంచి మొదలయ్యే మూడో టెస్టులో తాను ఆడతానని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ధీమా వ్యక్తం చేశాడు. బెంగళూరులో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు అతని కుడిచేతి చూపుడువేలుకు గాయమైంది. బంతిని స్పిన్ చేసేందుకు ఉపయోగించే వేలి నొప్పితో బాధపడుతున్న లియాన్ మూడో టెస్టులో ఆడకపోవచ్చన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, మ్యాచ్ ఆడగలనన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. 29 ఏళ్ల లియాన్ చూపుడువేల్లోని కండరాలు చిట్లినట్టు అనుమానిస్తున్నారు. దీనికితోడు మణికట్టు పైభాగంలో చర్మం మొద్దుబారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం వల్ల చేతిపై, ప్రధానంగా వేలిపై ఒత్తిడి పెరుగుతుంది. మొండిగా వ్యవహరిస్తే, బౌలింగ్ చేసే అవకాశాలను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ, లియాన్ మాత్రం మ్యాచ్ ఆడేందుకే సిద్ధమైనట్టు ప్రకటించాడు. ప్రతి సంవత్సరం తాను చాలా మ్యాచ్‌ల్లో ఆడతానని, ఒకటిరెండు సార్లు ఇలాంటి పరిస్థితి తలెత్తుతునే ఉంటుందని సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. వేలి కండరాలు చిట్లినప్పటికీ, పెద్దగా నొప్పిలేదని, కాబట్టి మూడో టెస్టులో పాల్గొనడం వల్ల ఇబ్బంది లేదనే తాను అనుకుంటున్నానని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, స్పిన్ చేసే వేలికి టేప్ లేదా బ్యాండేజీ వేసుకొని బౌలింగ్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని అన్నాడు. 2013లో తాను భారత్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన విషయాన్ని లియాన్ గుర్తుచేశాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ముందు జాగ్రత్త కోసం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడం లేదని అన్నాడు. అయితే, ఫిట్నెస్ సాధించే విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశాడు.

చిత్రం..నాథన్ లియాన్