క్రీడాభూమి

నాదల్ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 13: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, రోజర్ ఫెదరర్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీకి పరిమితమైన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో ముందడుగు వేశాడు. మొదటి రౌండ్‌లో బై లభించిన అతను రెండో రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు గైడో పెల్లాను అతను 6-3, 6-2 తేడాతో సులభంగా ఓడించాడు. హార్డ్ కోర్ట్‌పై 2014లో చివరిసారి టైటిల్ సాధించిన నాదల్ ఈ టోర్నీలో టైటిల్‌పై కనే్నశాడు. తాను ఆడిన మొదటి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, ప్రత్యర్థులకు పరోక్షంగా సవాళ్లు విసిరాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే అనూహ్యంగా ఓటమిపాలై నిష్క్రమించడంతో, ఈసారి టైటిల్ రేసులో ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్, ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్ రోజర్ ఫెదరర్ కూడా తమతమ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేశారు. జొకోవిచ్ 6-3, 5-7, 7-6 ఆధిక్యంతో కికి బెర్టానెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న మాజీ నంబర్ వన్ ఫెదరర్ 6-2, 6-1 తేడాతో స్టెఫెన్ రాబర్ట్‌పై విజయం సాధించాడు. కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్ రెండో రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. అమెరికా టీనేజర్ టేలర్ ఫ్రిట్జ్ 4-6, 7-5, 6-4 ఆధిక్యంతో సిలిక్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. జాక్ సాక్ 6-3, 0-6, 6-4 తేడాతో హెన్రీ లాక్సోనెన్‌పై గెలవగా, గ్రిగర్ దిమిత్రోవ్ 6-4, 6-0 స్కోరుతో మిఖలై యూజ్నీని ఓడించాడు. మాలెక్ జజిరీ చేతిలో మార్సెల్ గ్రానొలెర్స్ 5-7, 3-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. శామ్ క్వెర్రీని డొనాల్డ్ యంగ్ 6-3, 3-6, 6-3, డానియల్ ఇవాన్స్‌ను కెయ్ నిషికొరీ 6-3, 6-4 తేడాతో ఓడించి ముందంజ వేశారు. పెరీ హ్యూజెస్ హెర్బర్‌పై ఫెర్నాండో వర్డాస్కో (7-6, 6-1), కెవిన్ ఆండర్సున్‌పై స్టీవ్ జాన్సన్ (6-4, 3-6, 7-6), జిరీ వసెలీపై గిలెస్ ముల్లర్ (7-6, 6-1), హొరాసియో జెబలోస్‌పై నిక్ కిర్గియోస్ (6-3, 6-4), ఫాకన్డొ బగ్నిస్‌పై అలెగ్జాండర్ జ్వెరెవ్ (7-6, 6-3), ఫెడెరికో డెల్బోనిస్‌పై జువాన్ మార్టిన్ డెల్ పొట్రో (7-6, 6-3) విజయాలు సాధించారు.

చిత్రం..రాఫెల్ నాదల్