క్రీడాభూమి

రష్యా డోప్ మాస్టర్‌మైండ్ పోర్చుగలొవ్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, మార్చి 13: రష్యా డోపింగ్‌లో కీలక పాత్ర వహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సెర్గీ పోర్చుగలొవ్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రీడా వివాదాల కోర్టు (సిఎఎస్) అతనిని దోషిగా నిర్ధారించి, జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. నిషిద్ధ మెల్డోనియంను వాడి జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నిరుడు జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా జరిపిన డోప్ టెస్టులో దొరికిపోయానని చెప్పిన ఆమె, గత పది సంవత్సరాలుగా ‘మెల్డోనియం’ అనే మందును వాడుతున్నానని తెలిపింది. కాగా, వాడా ప్రకటించిన డోపింగ్ పరీక్షా ఫలితాల్లో చాలా మంది రష్యా అథ్లెట్లు అడ్డంగా దొరికిపోయారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల 120 కిలోల విభాగంలో పోటీపడిన అతను గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లో రజత పతకాన్ని అందుకున్నాడు. అతని ఉదంతం కలవరం కలిగిస్తుండగా, మరికొందరు అథ్లెట్లు కూడా నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడినట్టు రుజువైంది. ఇలావుంటే, వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న రష్యా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు ప్రకటించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఒకరి తర్వాత మరొకరిగా డోప్ దోషులు పుట్టుకొస్తునే ఉన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడానికి వీలుగా అథ్లెట్లతో ప్రభుత్వమే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేసిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ ప్రకటించిన తర్వాత లోతుగా విచారణ జరిపి, ఈ మొత్తం వ్యవహారంలో డాక్టర్ పోర్చుగలొవ్ కీలక పాత్ర పోషించాడని గుర్తించింది. కాగా రష్యాకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)లోని కొందరు మాజీ అధికారులు సహకరించారన్నది వాస్తవం. విజయాలు సాధించడానికి, పతకాలను పెంచుకోవడానికి అథ్లెట్లు అడ్డదారులు తొక్కడం కొత్తకాకపోయినా, నేరుగా ప్రభుత్వమే ఈ మార్గాలను సూచించి ప్రోత్సహించడం విడ్డూరం. క్రీడా రంగాన్ని డోపింగ్ మహమ్మారి ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదో చెప్పడానికి రష్యాను మించిన ఉదాహరణ లేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఎక్కువ కష్టపడకుండానే అందలం ఎక్కడం కోసం మాదక ద్రవ్యాలను వినియోగించడం ప్రపంచ క్రీడా రంగంలో ఒక విషసంస్కృతిని అధికారికంగా ప్రవేశపెట్టి, ప్రోత్సాహించవచ్చని రష్యా నిరూపించింది. అన్ని దేశాలు ఇదే మార్గంలో నడిస్తే, క్రీడాస్ఫూర్తికి అర్థం ఏమిటని వాడా వేసిన ప్రశ్నకు సమాధానం వెతకడం కష్టమే. మొత్తం మీద డోపింగ్ చీడ సోకిన క్రీడా రంగం అనేక సందర్భాల్లో పరువు పోగొట్టుకుంది. రష్యా ఉదంతం సరికొత్త కోణాలను ఆవిష్కరించింది. అథ్లెట్లకు వ్యూహాత్మకంగా డోపింగ్‌ను అలవాటు చేసి, తద్వారా పతకాలు రాబట్టాలన్న ఆలోచనను ఆచరణ రూపంలో అమలు చేసిన పోర్చుగలొవ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, తాను నిర్దోషినని, తనను నేరస్థుడిగా చూడడం తగదని అతను పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. చివరికి డోపింగ్ వివాదం సిఎఎస్‌కు చేరింది. కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన సిఎఎస్ చివరికి పోర్చుగలొవ్‌ను దోషిగా నిర్ధారించింది. ఒక ప్రభుత్వమే వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడేందుకు అతనే కారణమని పేర్కొంది. ఏ స్థాయిలోనైనా పోటీకి దిగిన తర్వాత జయాపజయాలను ఒకే రకంగా చూడాలన్నది క్రీడల ప్రధాన సూత్రం. విజయాలు సాధించడానికి చెమటోడ్చి సాధన చేయకుండా దగ్గర మార్గాలను ఎంచుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఎవరైనా ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నట్టు అనుమానం వేస్తే, వెంటనే స్పందించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సినన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. కానీ, రష్యా అందుకు భిన్నంగా వ్యవహరించిందని, ఫలితంగా డోప్ అనేది దేశ క్రీడా విధానంలో ఒక భాగమైందని సిఎఎస్‌లో వాడా వాదించింది. ఈ వాదనతో సిఎఎస్ ఏకీభవించింది. పోర్చుగలొవ్ నేరానికి పాల్పడినట్టు నిర్ధారించింది. అతనిపై జీవితకాల సస్పెన్షన్‌ను విధిస్తూ తీర్పునిచ్చింది.

చిత్రం..డాక్టర్ సెర్గీ పోర్చుగలొవ్