క్రీడాభూమి

అవకాశం దక్కని ప్రముఖ క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 6: చాలా మంది స్టార్ క్రికెటర్లకు ఈసారి వేలంలో అవకాశమే దక్కలేదు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్ ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్‌కు చెందిన హార్డ్ హిట్టర్ మార్టిన్ గుప్టిల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జి బెయిలీ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు మహేల జయవర్ధనే, మైఖేల్ హస్సీ, బ్రాడ్ హాడిన్ తదితరులు ఉన్నారు. అదే విధంగా వెస్టిండీస్‌కు చెందిన డారెన్ సమీ, శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ హస్సీ, ఆడమ్ వోగ్స్, మునాఫ్ పటేల్ వంటి పేరొందిన ఆటగాళ్లకు కూడా నిరాశ తప్పలేదు. ఇదే జాబితాలో సుబ్రహ్మణ్య బద్రీనాథ్, ఉస్మాన్ ఖాజా, మనోజ్ తివారీ, కేన్ రిచర్డ్‌సన్, అశోక్ దిండా, అజంతా మేండిస్, సులేమాన్ బెన్, రాహుల్ శర్మ, డేవిడ్ హస్సీ, డారెన్ బ్రేవో, ప్రజ్ఞాన్ ఓఝా తదితరులు కూడా ఉన్నారు.