క్రీడాభూమి

విజయ్ హజారే ట్రోఫీ ధోనీపైనే అభిమానుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: విదర్భతో బుధవారం జరిగే విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి, సెమీస్‌లో చేరడంపై జార్ఖండ్ దృష్టి సారిస్తే, ప్రేక్షకుల దృష్టి మాత్రం ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపైనే కేంద్రీకృతం కానుంది. జాతీయ జట్టులో అన్ని ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన తర్వాత ధోనీ జార్ఖండ్ జట్టుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. కల్యాణీలో జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ విజయంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. అతని నుంచి మరోసారి గొప్ప ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. మ్యాచ్ స్థాయి ఎలాంటిదైనా, ఫార్మాట్ ఏదైనా, కేవలం ధోనీని చూసేందుకు ఎగమడే అభిమానులు లక్షల్లో ఉంటారు. ఇలావుంటే, గ్రూప్ ‘డి’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన జార్ఖండ్ నాలుగు విజయాలు సాధించి, రెండు పరాజయాలను చవిచూసి, రెండో స్థానంలో నిలిచింది. విదర్భ గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లు ఆడి, ఐదు విజయాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

చిత్రం..మహేంద్ర సింగ్ ధోనీ