క్రీడాభూమి

సంయమనం పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 14: భారత్‌తో జరిగే మిగతా రెండు టెస్టుల్లో సంయమనం పాంటించాలని ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇయాన్ చాపెల్ హితవు పలికాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు రాళ్లు విసిరే స్థితిలో లేరని వ్యాఖ్యానించాడు. ‘స్లెడ్జింగ్’కు దిగకుండా జాగ్రత్త పడాలని ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ సూచించాడు. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ ఎవరూ కోరుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఇకపై వాటిని పక్కకుపెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఆటగాళ్లు మైదానంలో వాగ్వాదానికి దిగకుండా చూడాల్సిన బాధ్యత క్రికెట్ బోర్డు అధికారులదేనని ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. క్రికెటర్లు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకండా చూడాలని అధికారులను కోరాడు. ప్రత్యర్థులను హేళన చేస్తే, వారు కూడా తీవ్రంగానే స్పందిస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నాడు. చివరి రెండు టెస్టులు ఉత్కంఠ భరితంగా సాగుతాయన్న నమ్మకం తనకు ఉందన్నాడు. వివాదాలకు దిగకుండా జాగ్రత్త పడాలని, ఈ విషయంలో అధికారులు కూడా దృష్టి సారించాలని ఇయాన్ చాపెల్ కోరాడు.

చిత్రం..ఇయాన్ చాపెల్