క్రీడాభూమి

అదే దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 14: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లోనూ టీమిండియా దూకుడు కొనసాగుతుందని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. మైదానంలో ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంతంగా ఉండాలని ఆటగాళ్లను కోరే ప్రసక్తే లేదని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు. స్వతఃసిద్ధమైన అలవాట్లను, ఉత్సాహాన్ని అడ్డుకోవడం తన లక్ష్యం కాదని చెప్పాడు. బెంగళూరు టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మధ్య తలెత్తిన డిఆర్‌ఎస్ వివాదం మరింత పెరగకుండా చూడడంలో బిసిసిఐ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించాడు. సరైన సమయంలో, సరైన రీతిలో బోర్డు స్పందంచడం వల్లే వివాదానికి తెరపడిందన్నాడు. అయితే, మిగతా రెండు మ్యాచ్‌ల్లో మితిమీరిన శాంతంగా ఉండాలని ఆటగాళ్లు ఎవరినీ కోరబోనని అన్నాడు. దీని వల్ల సమస్యలు తలెత్తుతాయని, ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతుందని వస్తున్న విమర్శలను కుంబ్లే తోసిపుచ్చాడు. ఒకరితో మరొకరు పోటీపడుతూ, దూకుడును కొనసాగించినప్పుడే పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతాయని అన్నాడు.
బోర్డుల కృషి భేష్: క్లార్క్
డిఆర్‌ఎస్ వివాదంలో క్రికెట్ బోర్డులు అత్యంత వేగంగా స్పందించడం ఎంతో ఆనందంకరమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. బిసిసిఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) కల్పించుకోవడంతో, ఇప్పుడు అంతా మ్యాచ్‌పై దృష్టి కేంద్రీకరించే అవకాశం లభించిందని చెప్పాడు. జరిగిన సంఘటనను పట్టించుకోకుండా, మిగతా టెస్టుల్లో భారత్‌కు గట్టిపోటీనివ్వాలని ఆసీస్ ఆటగాళ్లకు హితవు పలికాడు.