క్రీడాభూమి

విజయ్ హజారే క్రికెట్ టోర్నీ సెమీస్‌కు జార్ఖండ్, బెంగాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో జార్ఖండ్, బెంగాల్ జట్లు తమతమ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరాయి. విదర్భను ఢీకొన్న జార్ఖండ్ ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రవి జాంగిద్ (62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అతనితోపాటు గణేష్ సతీష్ (35), రజనీష్ కార్నెవార్ (22) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. జార్ఖండ్ బౌలర్లలో మోనూ కుమార్ 27 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 45.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. ఓపెనరు ప్రత్యూష్ సింగ్ 33, ఇషాన్ కిషన్ 35 చొప్పున పరుగులు చేయగా, చివరిలో ఇశాంక్ జగ్గీ (41 నాటౌట్), ధోనీ (18 నాటౌట్) జట్టును విజయపథంలో నడిపించారు.
మరో క్వార్టర్ ఫైనల్‌లో మహారాష్టప్రై బెంగాల్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహారాష్ట్ర 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాహుల్ త్రిపాఠి 95 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ (63) అర్ధ శతకం సాధించాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 43, కేదార్ జాదవ్ 44 పరుగులు చేసి, మహారాష్ట్ర భారీ స్కోరుకు సహకరించారు. లక్ష్యం చాలా కష్టంగా కనిపించినప్పటికీ, బెంగాల్ ఏ దశలోనూ నిరాశ చెందకుండా, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. చివరికి మరో బంతి మిగిలి ఉండగా, ఆరు వికెట్లకు 320 పరుగులు చేసి, విజయం సాధించింది. ఓపెనర్ శ్రీవత్స గోస్వామి (74), అగ్నీవ్ పన్ (47), కెప్టెన్ మనోజ్ తివారీ (40), సుదీప్ చటర్జీ (60 నాటౌట్), అనుస్తుప్ మజుందార్ (66) చక్కటి బ్యాటింగ్ నైపుణ్యంతో బెంగాల్‌ను గెలిపించారు.
ఇది వరకే సెమీ ఫైనల్ చేరుకున్న బరోడా, తమిళనాడు జట్లు ఫైనల్‌లో చోటు చేసుకోసం గురువారం నాటి మ్యాచ్‌లో ఢీ కొంటాయి. రెండో సెమీ ఫైనల్ శుక్రవారం జార్ఖండ్, బెంగాల్ జట్ల మధ్య జరుగుతుంది.