క్రీడాభూమి

రెండు కోట్ల బేస్ ప్రైస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 6: షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌తోపాటు మరికొంత మంది ఆటగాళ్ల బేస్ ప్రైస్ రెండు కోట్ల రూపాయలు. కానీ, వాట్సన్, యువీ మాదిరి వారు అత్యధిక మొత్తాలను సంపాదించుకోలేకపోయారు. వీరిద్దరితోపాటు ఆశిష్ నెహ్రా, మిచెల్ మార్ష్, సంజూ శాంసన్, ఇశాంత్ శర్మ, కెవిన్ పీటర్సన్, దినేష్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, ధవళ్ కులకర్ణి తదితరుల కనీస ధర రెండు కోట్ల రూపాయలే. అయితే, నెహ్రాకు 5.5, మిచెల్ మార్ష్‌కు 4.8, సంజూ శాంసన్‌కు 4.2 కోట్ల రూపాయలు లభించాయి. అదే విధంగా ఇశాంత్‌కు 3.8, కెవిన్ పీటర్సన్‌కు 3.5 కోట్లు దక్కాయి. దినేష్ కార్తీక్ తన కనీస ధరకు కేవలం 30 లక్షల రూపాయలు అదనంగా పొందగలిగాడు. గత ఏడాది అతనికి 12 కోట్ల రూపాయలు లభించడం గమనార్హం. స్టువర్ట్ బిన్నీ, ధవళ్ కులకర్ణి తమతమ బేస్ ప్రైస్‌కు సమాన మొత్తాలను అందుకున్నారు.