క్రీడాభూమి

బౌలర్లకే అనుకూలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 15: రాంచీ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని నిపుణుల అభిప్రాయం. జెఎస్‌సిఎ మైదానంపై బంతి చాలా తక్కువగా బౌన్స్ అవుతుంది. బంతి బ్యాట్‌పైకి రాకపోవడంతో, పరుగుల కోసం బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే, ఇది టెస్టు కాబట్టి, రెండుమూడు సెషన్స్ తర్వాత పిచ్ తీరు మారే అవకాశం ఉంటుంది. బెంగళూరు పిచ్ టెస్టు క్రికెట్‌కు ఏమాత్రం అనువుగా లేదని, అక్కడ మ్యాచ్‌ని నిర్వహించకపోతే బాగుండేదని ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ చేసిన విమర్శలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాంటి విమర్శలు రాకుండా గ్రౌండ్స్‌మెన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, మొదటి రెండు రోజుల ఆట తర్వాతే, పిచ్ స్వభావంపై ఒక అవగాహన వస్తుంది. అంత వరకూ రెండు జట్ల ఆటగాళ్లకూ తిప్పలు తప్పవు. కాగా, పిచ్ టెస్టుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్ బహదూర్ సింగ్ హామీ ఇస్తున్నాడు.