క్రీడాభూమి

నేడు సిఒఎ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: బిసిసిఐ పాలనా వ్యవహారాలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఎఒ) శుక్రవారం సమావేశమై, లోధా కమిటీ సిఫార్సుల అమలు తదితర అంశాలను చర్చించనుంది. అదే విధంగా కోర్టు కేసుపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలను కూడా ఈ కమిటీ సమీక్షిస్తుంది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలే ఈ కమిటీ ముందున్న ప్రధాన లక్ష్యమన్నది విదితమే. అన్ని సభ్య సంఘాల నుంచి ఆమోదం పొంది, దశల వారీగా వాటి అమలుకు కమిటీ కృషి చేస్తున్నది. అంతేగాక, బిసిసిఐ పాలనా వ్యవహారాలను పారదర్శకంగా ఉంచేందుకు కూడా ప్రయత్నిస్తుంది.