క్రీడాభూమి

దినేష్ చండీమల్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 16: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో దినేష్ చండీమల్ శతకంతో రాణించాడు. అతని ప్రతిభతో లంక 338 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది. ఏడు వికెట్లకు 238 పరుగుల ఓవర్‌నైట్ సోరుతో రెండో రోజైన గురువారం ఉదయం ఆటను కొనసాగించిన శ్రీలంక మరో 12 పరుగుల తర్వాత రంగన హెరాత్ వికెట్‌ను కోల్పోయింది. అతను 91 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 25 పరుగులు చేసి, షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. లంక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు విశ్వప్రయత్నం చేసిన చండీమల్ 300 బంతుల మారథాన్ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 138 పరుగులు చేసి, మెహదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో మొసాడెక్ హొస్సేన్‌కు దొరికిపోయాడు. సురంగ లక్మల్ 35 పరుగులు అవుట్‌కాగా, లంక మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది.