క్రీడాభూమి

జొకోవిచ్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, హాట్ ఫేవరిట్ నొవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. వరల్డ్ నంబర్ వన్ ఆండీ ముర్రే ఇది వరకే పరాజయాన్ని చవిచూడగా, టైటిల్ రేసులో అందరి కంటే జొకోవిచ్ ముందుంటాడని విశే్లషకులు అభివర్ణించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అతను కూడా ఇంటిదారి పట్టాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ, నిక్ కిర్గియోస్ 6-4, 7-6 ఆధిక్యంతో జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. అతను వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేయడం విశేషం. ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన ముర్రే, జొకోవిచ్ ఇంటిదారి పట్టడంతో ఫేవరిట్ జాబితాలో ఫెదరర్ ముందుకు దూసుకొచ్చాడు.

చిత్రాలు..నొవాక్ జొకోవిచ్ , జెయంట్ కిల్లర్ నిక్ కిర్గియోస్