క్రీడాభూమి

ఫెదరర్‌కు నాదల్ చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 16: కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ వయసును లెక్కచేయకుండా యువ ఆటగాళ్లతో పోటీపడుతున్నాడు. ఈఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించిన 35 ఏళ్ల ఫెదరర్ అదే దూకుడును కొనసాగిస్తూ, ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు చెక్ పెట్టాడు. నాదల్ లాంటి హార్డ్‌కోర్ట్ స్పెషలిస్టును 6-2, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేయడాన్ని చూస్తే అతని విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోచ్చు. నాదల్‌పై ఫెదరర్ విజయం సాధించడం వరుసగా ఇది నాలుగోసారి. మరో మ్యాచ్‌లో డామినిక్ థియెమ్ 6-3, 6-2 తేడాతో గేల్ మోన్ఫిల్స్‌ను ఓడించి, ఫెదరర్‌తోపాటు ప్రీ క్వార్టర్స్ చేరారు. ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా కొనసాగింది. చివరి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో జాక్ సాక్స్ 4-6, 7-6, 7-6 తేడాతో మాలెక్ జజిరీపై విజయం సాధించాడు. స్టానిస్లాస్ వావ్రిన్కా, యొహిహితో నిషాకా మధ్య పోరు కూడా హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ని వావ్రిన్కా 3-6, 6-3, 7-6 ఆధిక్యంతో గెల్చుకున్నాడు. పాబ్లో కువాస్ 6-3, 3-6, 6-3 స్కోరుతో డేవిడ్ గోఫిక్‌పై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.