క్రీడాభూమి

కోహ్లీకి గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజానికి గాయమైంది. ఆస్ట్రేలియాతో గురువారం మొదలైన మూడో టెస్టు, మొదటి రోజున, భోజన విరామం తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఒక బౌండరీని ఆడేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో నేలపై బలంగా పడడంతో, అతని భుజానికి దెబ్బ తగిలింది. నొప్పి భరించలేక అల్లాడిన అతను కొంత సేపు ఐస్ ప్యాక్‌లతో ఉపశమనం పొందిన అతను ఆతర్వాత వైద్య పరీక్షలకు హాజరయ్యాడు. భుజాన్ని స్కాన్ చేశారని, నివేదిక శుక్రవారం వస్తుందని భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీ్ధర్ తెలిపాడు. అప్పటి వరకూ గాయం తీవ్రత గురించి ఏమీ చెప్పలేమని అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అన్న ప్రశ్నకు అతను నేరుగా సమాధానం చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు సమాధానం దానంతట అదే తెలుస్తుందని వ్యాఖ్యానించాడు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని, ఇప్పటికిప్పుడే స్పందించడం కష్టమని పేర్కొన్నాడు. ఇలావుంటే, ఒకవేళ శుక్రవారం కోహ్లీ ఫీల్డింగ్‌కు దిగితే, ఆతర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేసుకునే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో కాకుండా లోయర్ ఆర్డర్‌లో అతను బ్యాటింగ్ చేస్తాడని సమాచారం. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే, ఈ మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద కోహ్లీ గాయంపై శుక్రవారం స్పష్టత వస్తుంది.