క్రీడాభూమి

అలరిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కటి హుక్ షాట్‌తో అభిమానులను అలరిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్. అతను సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను చివరిసారి 2014లో యుఎఇలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాడు. కాగా, మాక్స్‌వెల్‌కు కెరీర్‌లో ఇది కేవలం ఐదో టెస్టు.
స్మిత్, మాక్స్‌వెల్ కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 159 పరుగులు జోడించారు. భారత్‌లో ఆస్ట్రేలియా తరఫున ఈ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2013 మార్చి 2న మైఖేల్ క్లార్క్, మాథ్యూ వేడ్ 145 పరుగులతో నెలకొల్పిన రికార్డును స్మిత్, మాక్స్‌వెల్ బద్దలు చేశారు.